భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- January 20, 2026
న్యూఢిల్లీ: భారత్ లో పర్యటిస్తున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, భారత ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి పలు కీలక రంగాల్లో సహకారంపై చర్చించారు. ముఖ్యంగా ఎకానమీ, ఇన్వెస్ట్ మెంట్స్, అభివృద్ధి, అంతరిక్షం, పునరుత్పాదక ఇంధనం మరియు ఆహార భద్రతా రంగాలు, టెక్నాలజీ, ఏఐ సంబంధిత రంగాలతో పాటు ఇతర అంశాలను సమీక్షించారు. ఈ సందర్భంగా అనేక ఒప్పందాలు, అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఇరు దేశాధినేతల సమక్షంలో వాటిని పరస్పరం మార్చుకున్నారు.
రక్షణ రంగంలో వ్యూహాత్మక భాగస్వామ్యం ఒప్పంద పత్రాలను యూఏఈ ఉప ప్రధాన మంత్రి మరియు విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మరియు భారత విదేశాంగ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జైశంకర్ ఇచ్చిపుచ్చుకున్నారు.
అంతరిక్ష రంగంలో ఉమ్మడి చొరవను ప్రారంభించడానికి వీలుగా యూఏఈ స్పేస్ ఏజెన్సీ మరియు ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ది ప్రమోషన్ అండ్ అక్రిడిటేషన్ ఆఫ్ స్పేస్ యాక్టివిటీస్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఒప్పంద పత్రాలను అంతర్జాతీయ సహకార సహాయ మంత్రి హర్ ఎక్సలెన్సీ రీమ్ బింట్ ఇబ్రహీం అల్ హషేమి మరియు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఇచ్చిపుచ్చుకున్నారు.
ADNOC గ్యాస్ మరియు హిందూస్తాన్ పెట్రోలియం లిమిటెడ్ మధ్య అమ్మకం మరియు కొనుగోలు ఒప్పందం కుదిరింది. పరిశ్రమ మరియు అధునాతన సాంకేతిక మంత్రి, ADNOC సీఈఓ డాక్టర్ సుల్తాన్ బిన్ అహ్మద్ అల్ జాబర్ మరియు భారత చమురు మరియు సహజ వాయువు మంత్రిహర్దీప్ సింగ్ పూరి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
యూఏఈ వాతావరణ మార్పులు మరియు పర్యావరణ మంత్రిత్వ శాఖ, భారత వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన వ్యవసాయ మరియు ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ మధ్య ఆహార భద్రత మరియు సాంకేతిక అవసరాలపై కుదిరిన అవగాహన ఒప్పందంపై అంతర్జాతీయ సహకార సహాయ మంత్రి రీమ్ బింట్ ఇబ్రహీం అల్ హషేమి, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ సంతకాలు చేశారు.
డోలెరా స్పెషల్ ఇన్వెస్ట్‌మెంట్ జోన్ అభివృద్ధికి సంబంధించి యూఏఈలోని పెట్టుబడుల మంత్రిత్వ శాఖ మరియు భారత్ లోని గుజరాత్ ప్రభుత్వం మధ్య పెట్టుబడి సహకారానికి సంబంధించిన ఒప్పంద పత్రాలను యూఏఈ విదేశాంగ మంత్రి సయీద్ బిన్ ముబారక్ అల్ హజేరి మరియు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ పరస్పరం మార్చుకున్నారు.
తాజా వార్తలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి







