'రాధేశ్యామ్' కూడా ఓటీటీలో చూడాలసిందేనా?!
- May 03, 2021
ఒకప్పుడు ఓటీటీ అంటే ఏంటో కూడా కొందరికి తెలియని పరిస్థితి. కాని ఇప్పుడు కరోనా పరిస్థితులలో చాలా మంది సినీ ప్రియులు ఓటీటీపై మక్కువ చూపిస్తున్నారు. థియేటర్స్ తెరవకపోవడం, ఓపెన్ చేసిన కరోనా వలన వెళ్లలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఓటీటీనే బెస్ట్ ఆప్షన్ అనుకుంటున్నారు. ఇక నిర్మాతలు సైతం రిలీజ్‌కు సిద్దంగా ఉన్న సినిమాలను పెండింగ్ పెట్టడం ఇష్టం లేక ఓటీటీలో విడుదల చేస్తున్నారు.
ప్రభాస్- పూజా హెగ్డే ప్రధాన పాత్రలలో తెరకెక్కిన రాధే శ్యామ్ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయనున్నారని ప్రచారం నడుస్తుంది. జూలై 30న రాధే శ్యామ్ మూవీని థియేటర్‌లో విడుదల చేస్తాం అని మేకర్స్ ప్రకటించారు. కాని ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఆ సమయానికి థియేటర్స్ తెరవడం కష్టంగానే అనిపిస్తుంది. ఈ క్రమంలో ‘రాధేశ్యామ్’ సినిమాను పే పర్ వ్యూ విధానంలో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట. కాగా, పే పర్ వ్యూ విధానంతో.. సల్మాన్ ఖాన్ రాధే: ది మోస్ట్ వాంటెడ్ బాయ్ సినిమాను మే 13న విడుదల చేయడానికి సిద్ధంగా ఉందని తెలిసిందే.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్‌లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







