వాట్సాప్‌లోనే వ్యాక్సిన్ సెంటర్ వివరాలు!
- May 03, 2021
మీరు ఉన్న ప్రాంతం నుంచే మీకు దగ్గర్లో ఉన్న వ్యాక్సినేషన్ సెంటర్ల వివరాలు తెలుసుకోవచ్చు. అది కూడా ఉచితంగా, మీ వద్ద స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు, సులభంగా వ్యాక్సిన్‌కు రిజిస్ట్రేషన్‌కు మీ వివరాలను నమోదు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం మే 1 నుంచే 18 ఏళ్లు పైబడిన ప్రతి భారతీయ పౌరునికి టీకా అందిస్తామని మోడీ ప్రభుత్వం తెలిపింది. వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా ఏప్రిల్ 28 నుంచే ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే, వ్యాక్సిన్ నమోదుకు మీ ఇంటికి దగ్గర్లో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ సెంటర్ల వివరాలు ఈజీగా వాట్సాప్ ద్వారా తెలుసుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం.
ముందుగా మీ వాట్సప్‌లోని కరోనా హెల్ప్ డెస్క్ అయిన MYGOVలో ద్వారా మీకు దగ్గర్లో ఉన్న వ్యాక్సిన్ సెంటర్ల వివరాలు తెలుసుకోవచ్చు. దీనికి మొదటగా మీరు మీ వాట్సాప్ మొబైల్ ద్వారా ‘NAMASTE’ అని టైప్ చేసి 9013151515 నంబర్‌కు పంపించాలి. చాట్‌బట్ మీకు ఆటోమెటిక్‌గా మీకు దగ్గర్లో ఉన్న వ్యాక్సిన్ సెంటర్ల లొకేషన్‌ను చూపిస్తుంది. అప్పుడు మీకు అందుబాటులో ఉన్న టీకా సెంటర్‌ను ఎంచుకోవచ్చు.
–దాని తర్వాత మీరు, మీరు ఉంటున్న ఆరు అంకెల ఏరియా పిన్‌కోడ్‌ను టైప్ చేయాలి
– దీంట్లో సెంటర్ వివరాలతో పాటు, రిజిస్ట్రేషన్ నమోదుకు లింక్ కోవిన్ ద్వారా చేసుకోవాలి.ఆరోగ్యసేతు యాప్ ద్వారా కూడా వ్యాక్సిన్‌కు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. హింది, ఇంగ్లిష్ రెండు భాషల్లో అందుబాటులో ఉంటుంది. డిఫాల్ట్ ఆప్షన్ ద్వారా హిందిలో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కరోనాకు సంబంధించిన సందేహాలకు కేంద్ర ప్రభుత్వం ఈ వాట్సాప్ చాట్బట్ను మార్చ్ 2020లో ప్రారంభించింది.
తాజా వార్తలు
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతంపై చర్చలు.. ముంబైలో జైశంకర్‌తో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ భేటీ
- టైగర్ ప్రాఫ్ ను చంపేందుకు రూ.35వేల సుపారీ!
- ప్రపంచ చరిత్రలోనే తొలిసారి ఉక్రెయిన్ అద్భుత రెస్క్యూ ఆపరేషన్
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్‌తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భేటీ..!!
- జెడ్డాకు విమాన సర్వీసులు తగ్గించిన ఖతార్ ఎయిర్వేస్..!!
- విదేశాల్లో వివాహం..ఒమన్ పౌరులకు ప్రీ-మ్యారిటల్ వైద్య పరీక్షలు తప్పనిసరా?
- యూఏఈలో ఆన్లైన్లో అవమానిస్తే జైలుశిక్ష.. Dh500,000 వరకు జరిమానా..!
- మిస్ కేరళ 2026.. కువైట్‌కు చెందిన భారతీయ యువతికి రన్నరప్ టైటిల్..!!
- కువైట్‌లో ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త డి.వి. మల్హోత్రా కన్నుమూత..!!
- బహ్రెయిన్‌లో ఘనంగా ‘శారదోత్సవ్ 2026’ ప్రారంభం..!!







