కోవిడ్ మహమ్మారిని అరికట్టడానికి ప్రజలలో అవగాహన కల్పించడానికి సహకరించండి: ఏపీ గవర్నర్

- May 03, 2021 , by Maagulf
కోవిడ్ మహమ్మారిని అరికట్టడానికి ప్రజలలో అవగాహన కల్పించడానికి సహకరించండి: ఏపీ గవర్నర్

విజయవాడ: కోవిడ్ -19 మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి తగిన జాగ్రత్తలు తీసుకొని కోవిడ్ వైరస్ బారి నుండి రక్షింక్షుకునే విధానాలపై ప్రజలలో అవగాహన కల్పించడండానికి  ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిస్వభూషన్ హరిచందన్  రాష్ట్రంలోని వివిధ మత మరియు ఆధ్యాత్మిక సంస్థల పెద్దలను  ఉద్దేశించి రాజ్ భవన్ నుండి వర్చువల్ మోడ్‌లో సోమవారం జరిగిన వెబినార్ లో  ప్రసంగించారు. 

మన దేశ ప్రజల జీవితాలలో మతం మరియు విశ్వాసానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని, ప్రస్తుత విపత్కర పరిస్తుతులలో  ప్రజలు ఆందోళ చెందకుండా, ప్రశాంతంగా  ఉండడానికి కోవిడ్ మహమ్మారి వ్యాప్తి నుండి ప్రజలను రక్షించడానికి, వారిలో మనస్తైర్యం నింపడానికి  వివిధ మత మరియు ఆధ్యాత్మిక సంస్థల పెద్దలు  ముందుకు రావాలని గవర్నర్ బిస్వ భూషన్ హరిచందన్   కోరారు.  కోవిడ్ -19 మహమ్మారి మానవాళి మొత్తానికి  ఒక  సవాలుగా నిలిచిందని ఈ సందర్భంగా గవర్నర్ బిస్వ భూషన్ హరిచందన్  అన్నారు.

ప్రజలలో ఆత్మస్థైర్యం నింపే విధంగా మత పెద్దలు కోవిడ్ పై అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని గవర్నర్ కోరారు. మాస్క్ ధరించడం, సామాజిక దూరాన్ని పాటించడం, తరచూ చేతులు కడుక్కోవడం, పరిసరాలను శుభ్రంగా ఉంచడం వంటి కోవిడ్ మహమ్మారిని అరికట్టే  చర్యలు తీసుకోవడానికి ప్రజలలో అత్యవసరంగా  అవగాహన కల్పించవలసిన అవసరం ఉందని గవర్నర్ చెప్పారు. ప్రజలు తమను కాపాడుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు , సమాజం లోని ఇతర ప్రజలకు కోవిడ్ బారి నుండి  రక్షించుకునేందుకు  తగిన  జాగ్రత్తలను ఖచ్చితంగా  పాటించాలని వారి అనుచరులకు ప్రత్యేక విజ్ఞప్తి చేయాలని వెబ్‌నార్‌లో పాల్గొన్న మత, ఆధ్యాత్మిక నాయకులను గవర్నర్ హరిచందన్ కోరారు.


కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి తీసుకోవలసిన తప్పనిసరి జాగ్రత్తలు మరియు ఇంట్లో ఉండవలసిన అవసరం గురించి, అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండటం, ఇంట్లో ఉంటూనే  పండుగలు జరుపుకోవడం వంటి వాటిపై తమ ప్రసంగాలతో  ప్రజలకు అవగాహన కలిగించాలని  ఆధ్యాత్మిక మరియు మత పెద్దలను  గవర్నర్ కోరారు. శుభ కార్యాలు, ఇతర కార్యక్రమాలు  ప్రస్తుతానికి వాయిదా వేసుకోవాలని  లేదా వాటిని చాలా పరిమిత సభ్యులతో  కోవిడ్ మార్గదర్శకాలను సక్రమంగా పాటిస్తూ జరుపుకునే విధంగా  ప్రజలకు తెలియ చెప్పాలని గవర్నర్ కోరారు.

కోవిడ్ వాక్సిన్  కరోనా  వైరస్ నుండి రక్షణను ఇస్తుంది కావున అర్హత ఉన్న వారందరూ  కోవిడ్ వాక్సిన్  అత్యవసరంగా తీసుకోవాలని  గవర్నర్ హరిచందన్ చెప్పారు. కోవిడ్ లక్షణాలను ముందుగా గుర్తించడం ద్వారా ఇంట్లో గాని హాస్పిటల్ లో గాని వెంటనే  చికిత్స తీసుకుంటే కరోనా వ్యాధిని నయం చేయవచ్చు  ఇంకా మరణాల సంఖ్య తగ్గించవచ్చని గవర్నర్ చెప్పారు.  కరోనా మహమ్మారి సమూలంగా నిర్మూలించడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు పాటించే విధంగా  ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలలో చురుకైన పాత్ర వహించ వలసినదిగా  గవర్నర్ హరిచందన్  మత మరియు ఆధ్యాత్మిక పెద్దలకు  విజ్ఞప్తి చేశారు.

టిటిడి నుండి వెబినార్‌లో పాల్గొన్న ఎ.వేణుగోపాల్ దీక్షితులు మాట్లాడుతూ, కోవిడ్ వ్యాప్తిని నివారించడంలో మార్గదర్శకాల ప్రకారం టిటిడి అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని, మాస్క్  ధరించడం, సామాజిక దూరం పాటించడం, భక్తుల ఉపయోగం కోసం హ్యాండ్ శానిటైజర్‌లను పలు చోట్ల ఉంచారని చెప్పారు. . ఈ సందర్భంగా జీయర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ కు  చెందిన చిన జీయర్ స్వామి మాట్లాడుతూ, కోవిడ్ -19 యొక్క రెండవ వేవ్ ప్రభావం ఊహించనది అని, అధికారులు నిర్దేశించిన నిబంధనలను ఖచ్చితంగా పాటించడం మరియు సామాజిక దూరాన్ని కొనసాగించడం ద్వారా కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చని  ప్రజలలో విశ్వాసం కలిగించాల్సిన అవసరం ఉందని అన్నారు. కోవిడ్ -19 రోగులలో బలమైన సంకల్పం కల్పిస్తే వారు వ్యాధి నుండి కోలుకోగలరు అని శ్రీ చిన జీయర్ స్వామి చెప్పారు. ప్రజలు ఇంట్లో వండిన ఆహారం తీసుకోవాలని, బయటి ఆహారాన్ని తీసుకోకుండా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆయన సూచించారు.


పుట్టపర్తిలోని శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ యొక్క టి. కోటేశ్వరరావు మాట్లాడుతూ, వారి సేవాదళ్ సభ్యులకు యునిసెఫ్ సహకారంతో కోవిడ్ వ్యాప్తిని అరికట్టే  ప్రవర్తనపై శిక్షణ ఇవ్వబడిందని  మరియు వారి ద్వార  ప్రజలలో అవగాహన కల్పించడానికి ఎస్ఎంఎస్ (సానిటేషన్ , మాస్క్, సోషల్ డిస్టెన్స్)  ప్రచారాలను చేపట్టామని అయన చెప్పారు. వెబినార్లో పాల్గొన్న  పరిపూర్నానంద స్వామీజీ మాట్లాడుతూ, కోవిడ్ -19 అనేది కాస్మిక్ ఎనర్జీ ద్వారా మానవులపై ప్రకృతి విసిరిన సవాలని, ఈ  వైరస్ మానవ శరీరంలోని వివిధ అవయవాలపై  దాడి చేయడం ద్వారా విచిత్రమైన ప్రవర్తన కలిగి తరచూ మార్పు చెందుతుందని చెప్పారు. ఆవు పిదకలను  కాల్చడం, వేడినీరు తాగడం, ఆవిరి పీల్చడం, ప్రణయామం చేయడం , చల్లని వస్తువులను దూరంగా ఉంచడం , సూర్యరశ్మిలో ఉండడం  వంటి ఆయుష్ పద్ధతులను అనుసరించడం ద్వారా కోవిడ్ రోగులకు వ్యాధి నుండి బయటపడటానికి వారి ట్రస్ట్ సహాయపడిందని ఆయన చెప్పారు. ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ కర్నూల్ నుండి  మౌలానా అబ్దుల్ ఖాదీర్,  ముఫ్తీ యూసుఫ్ అల్లి సాబ్, ఇమామ్, మిల్లీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, హర్మోహిందర్ సాహ్ని, గురు ప్రబందక్ కమిటీ, విజయవాడ, దిల్షా సింగ్ ఆనంద్, గురుద్వారా సత్సంగ్, విశాఖపట్నం, కుమారి  శిరీష  బెహన్, బ్రహ్మకుమారిస్, విజయవాడ, డాక్టర్ టి. జార్జ్ కార్నెలియస్, బిషప్ సిఎస్ఐ ఆల్ సెయింట్స్ చర్చి, విజయవాడ,  అమరావతి బుద్ధ విహార్ కు  చెందిన తేరో  ఇంకా జైన్ సమాజ్, విజయవాడ నుండి  పన్నాలాల్ డి. జైన్,వెబినార్‌లో పాల్గొని, కరోనా  మహమ్మారిని కట్టడి  చేయడానికి అధికారులకు అన్ని విధాల సహాయపడటానికి ప్రజలలో అవగాహన కల్పించడం ద్వారా  వారి సహాయాన్ని అందిస్తామని చెప్పారు. గవర్నర్ గారి జాయింట్ సెక్రటరీ ఎ.శ్యామ్ ప్రసాద్ రాజ్ భవన్ నుండి వెబ్‌నార్‌ను సమన్వయపరిచారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com