జర్నలిస్టులను కూడా ఫ్రంట్‌లైన్ వర్కర్లుగా గుర్తిస్తున్నాం: కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి
- May 04, 2021
న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి ఆందోళన కల్గిస్తోంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ నియంత్రణ ఛాయలు పాటించాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ కోరారు.జర్నలిస్టులను కూడా ఫ్రంట్‌లైన్ వర్కర్లుగా గుర్తిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా ఆయా రాష్ట్రాలు అప్రమత్తత పాటిస్తూ నివారణ చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. 12 రాష్ట్రాల్లో లక్షకు పైగా క్రీయాశీలక కేసులు ఉన్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, అసోం, బీహార్, అరుణాచల్ ప్రదేశ్,తమిళనాడు, పశ్చిబెంగాల్‌లో తాజాగా కేసులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 22 రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు 15 శాతంగా ఉందని వెల్లడించారు.ఇప్పటికే 12 రాష్ట్రాల్లో కరోనా మూడో విడత వ్యాక్సినేషన్ ప్రారంభమైందని, 18 – 44 వయస్సు ఉన్న 20 లక్షల మందికి టీకాలు అందాయని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ దౌత్య శిక్షణ సంస్థ డీజీతో భారత రాయబారి విపుల్ భేటీ
- సీఎం రేవంత్ US టూర్ రద్దు..
- యూట్యూబ్‌కు పోటీగా చైనా ‘బిలిబిలి’ వచ్చేసింది..
- CBSE–JEE విధానం విద్యార్థుల్లో ఆలోచనా వైవిధ్యాన్ని తగ్గిస్తోంది: బిట్స్ వీసీ రామగోపాల్ రావు
- విశాఖలో బ్రిక్స్ క్రీడా మంత్రుల భేటీ.. భారత్ కీలక ప్రతిపాదనలు
- వాహనాలపై ట్రాఫిక్ జరిమానాలు పేరుకుపోతే చర్యలు తప్పవు: దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- అబుదాబిలో డిసెంబర్ 3 నుంచి ఫార్ములా-1 గ్రాండ్ ప్రిక్స్
- కొలరాడోలో NATS చెస్ టోర్నమెంట్ చక్కటి స్పందన
- ముష్రిఫ్ నేషనల్ పార్క్‌లో కొత్త బ్రిడ్జి ప్రారంభం..
- బహ్రెయిన్‌లో లోజ్ పండ్ల ధరలకు రెక్కలు..!!







