భారత్ కరోనా అప్డేట్

భారత్ కరోనా అప్డేట్

న్యూ ఢిల్లీ: భార‌త్‌లో ప్రతిరోజు మూడు ల‌క్షల‌కు పైగా క‌రోనా కేసులు నమోద‌వుతుండ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.నిన్న కొత్తగా 3లక్షల, 82వేల, 315 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.నిన్న 3లక్షల, 38వేల, 439 మంది కోలుకున్నారు.దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2కోట్ల, 06లక్షల, 65వేల,148 కు చేరింది.

గడిచిన 24 గంట‌ల సమయంలో 3వేల,780 మంది కరోనా కారణంగా మృతి చెందారు.దీంతో మృతుల సంఖ్య 2లక్షల, 26వేల 188కు పెరిగింది.దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1కోటి, 69లక్షల, 51వేల, 731 మంది కోలుకున్నారు.34లక్షల, 87వేల, 229 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు,హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.దేశ వ్యాప్తంగా 16కోట్ల ,04లక్షల, 94వేల,188 మందికి వ్యాక్సిన్లు వేశారు.

Back to Top