విశాల్ కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం!
- May 06, 2021
చెన్నై: కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ 31వ చిత్రం పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఈ సినిమాతో షార్ట్ ఫిల్మ్స్ మేకర్ టి.పి. శర్వానన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. 'దేవి -2' ఫేమ్ డింపుల్ హయతి కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం డింపుల్ తెలుగులో రవితేజ సరసన 'ఖిలాడీ' చిత్రంలో చేస్తోంది. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చుతుండగా, బాలసుబ్రమణియన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. ప్రస్తుతం ఆనంద్ శంకర్ దర్శకత్వంలో 'ఎనిమి' సినిమాలో ఆర్యతో కలిసి విశాల్ నటిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అలానే మిస్కిన్ దర్శకత్వంలో 'తుప్పరివాలన్ -2' చేయాల్సి ఉన్నా, క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఈ సినిమాకు బ్రేక్ పడింది. దాంతో శరవేగంగా ఈ 31వ చిత్రం షూటింగ్ పూర్తి చేసి, ఆగస్ట్ నెలలో విడుదల చేయాలని విశాల్ భావిస్తున్నాడు. దీనికి అతనే నిర్మాత కూడా...!
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!







