సింగిల్ డోస్ కోవిడ్ వ్యాక్సిన్ 'స్పుత్నిక్ లైట్' కు రష్యా గ్రీన్ సిగ్నల్
- May 06, 2021
రష్యా: ప్రపంచదేశాల్లో కరోనాతో పోరాటం కొనసాగిస్తున్న సమయంలో రష్యా నుంచి మరొక కోవిడ్ వ్యాక్సిన్ ఇప్పుడు అందుబాటులోకి రానుంది. కరోనా కట్టడి కోసం అభివృద్ధి చేసిన సింగిల్ డోస్ వెర్షన్ స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ కు రష్యా ఆరోగ్య అధికారలు ఆమోదం తెలిపారు. దీని పేరు స్పుత్నిక్ లైట్.
రెండు డోసుల స్పుత్నిక్ వీ టీకా సామర్థ్యం 91.6 శాతం కాగా, సింగిల్ డోస్ టీకా సామర్థ్యం 79.4 శాతమని వ్యాక్సిన్ కోసం నిధులు సహాయం చేస్తున్న రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్) గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. రష్యాలో గత ఏడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 15 వరకు నిర్వహించిన వ్యాక్సినేషన్ డ్రైవ్ అనంతరం 28 రోజుల తర్వాత సేకరించిన డేటా ఆధారంగా సింగిల్ డోస్ స్పుత్నిక్ లైట్ సామర్థ్యాన్ని అంచనా వేసినట్లు వెల్లడించింది.
మరోవైపు రష్యా కరోనా టీకా స్పుత్నిక్ వీని 60కిపైగా దేశాలు ఆమోదించాయి. భారత్ కూడా ఇటీవల దేశంలో అత్యవసర వినియోగానికి స్పుత్నిక్ వీని ఆమోదించిన విషయం తెలిసిందే. అయితే యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ (ఈఎంఏ), అమెరికాలోని ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) మాత్రం ఇప్పటి వరకు దీనిని ఆమోదించలేదు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







