సెలవుల్లో ఎయిర్ పోర్టుల వద్ద వీలైనంత త్వరగా ఆన్ లైన్ చెక్ ఇన్
- May 07, 2021
దోహా: హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు, ప్రయాణీకులు ఈద్ అల్ ఫితర్ సెలవుల నేపథ్యంలో ఆన్ లైన్ చెక్ ఇన్ సర్వీసుని వీలైనంత త్వరగా వినియోగించుకోవాలని సూచించింది. తమ ప్రయాణం సజావుగా సాగేందుకు ఇది దోహదం చేస్తుందని హమాద్ అంతర్జాతీయ విమానాశ్రయం పేర్కొంటోంది. కాగా, గ్రీన్ హెల్త్ స్టేటస్ ఖచ్చితంగా ప్రయాణీకులు ఎహ్తరాజ్ అప్లికేషన్ ద్వారా ప్రద్శించాలి. సెల్ఫ్ సర్వీస్ చెక్ ఇన్ అలాగే బ్యాగ్ డ్రాప్ సౌకర్యాలు కూడా అందుబాటులో వుంటాయి. ట్రావెల్ సంబంధిత నిబంధనల విషయమై ప్రయాణీకులు పూర్తి అవగాహన కలిగి వుండాలి. ఎలాంటి నిషేధిత వస్తువులూ తమ వెంట తీసుకురాకూడదు. లిథియం బ్యాటరీలతో నడిచే చిన్న వాహనాలు అనుమతించబడవు. వచ్చే ప్రయాణీకులు తమ వెంట నెగెటివ్ పిసిఆర్ టెస్ట్ రిజల్ట్ చూపే సర్టిఫికెట్ తీసుకురావాల్సిందే.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







