తర్వాతి విడతలో మూడో డోసు వేయనున్నట్లు బహ్రెయిన్ ప్రకటన
- May 08, 2021
బహ్రెయిన్: కరోనాను అడ్డుకునేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరంగా కొనసాగించిన బహ్రెయిన్ లేటెస్ట్ గా...మూడో డోస్ కు సంబంధించిన ప్రణాళికను కూడా వెల్లడించింది. తర్వాతి విడత వ్యాక్సినేషన్ లో భాగంగా మూడో డోస్ కూడా అందించనున్నట్లు జాతీయ వైద్య బృందం ప్రకటించింది. మూడో డోస్ తో నిర్ణీత వర్గాలు సంపూర్ణ ప్రయోజనాలను పొందుతారని అభిప్రాయపడింది. 60 ఏళ్లు అంతకు మించి వయసున్న వారు..ఊబకాయులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి తొలి డోసు వేసుకున్న 6 నెలల తర్వాత మూడో డోస్ వేయనున్నట్లు జాతీయ వైద్య బృందం అధికారులు తెలిపారు. మిగిలిన పౌరులు, ప్రవాసీయులకు తొలి డోసు తర్వాత 12 నెలలకు మూడో డోసు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. మూడో డోసు పొందాలనుకునే వారు మెడికల్ ప్రోటోకాల్ అనుసరించి బీఅవేర్ యాప్ లో ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్‌లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







