కడప జిల్లాలో పేలుడు.. 10 మంది కూలీల దుర్మరణం
- May 08, 2021
ఏపీ: ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది.కడప జిల్లాలో భారీ పేలుడు సంభవించి 10 మంది కూలీలు దుర్మరణం పాలయ్యారు.పేలుడు పదార్థాల బ్లాస్టింగ్ లో ఈ దుర్ఘటన జరిగింది.
కడప జిల్లా పోరుమామిళ్ల మండలం మామిళ్లపల్లి ముగ్గురాళ్ల గనిలో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు పేలుడు సంభవించింది.పేలుడు పదార్థాల క్రషర్ వద్ద ఈ ప్రమాదం సంభవించింది.ముగ్గురాయిని వెలికి తీసేందుకు కూలీలు వెళ్లారు.ఆ సమయంలో పేలుడు సంభవించింది.
సంఘటనా స్థలం అటవీ ప్రాంతంలో ఉంటుంది. పోలీసులకు సమాచారం అందింది. వారు అక్కడికి బయలుదేరారు.ఏడు మృతదేహాలను వెలికి తీశారు.మృతదేహాలు గుర్తు పట్టలేని స్థితిలో ఉన్నాయి.
డిటొనేటర్ పేలుడు వల్ల ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు. గాయపడినవారిని వివిధ ప్రాంతాల ఆస్పత్రులకు తరలించే పనిచేస్తున్నారు. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ముగ్గురాయిని పేల్చేందుకు డిటొనేటర్ వాడుతారు.రోజువారీ పనిలో భాగంగానే డెటొనేటర్ ను అమర్చారు. అది పేలిన సమయంలో కూలీలంతా అక్కడే ఉన్నారు.ప్రమాదం జరిగిన సమయంలో 30 మంది దాకా అక్కడ ఉన్నట్లు చెబుతున్నారు.యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం సంభవించిందనే విమర్శలు వస్తున్నాయి.
తాజా వార్తలు
- శిర్డీ సాయి శతాబ్ది మహాస్తూపం వెబ్సైట్ ఆవిష్కరణ
- విద్యార్థులకు కొత్త రూల్ తీసుకొచ్చిన సీఎం రేవంత్
- యూఏఈలో 100కు పైగా ఎస్ఎం అకౌంట్స్ బ్లాక్..!!
- కువైట్ బేలోకి ప్రవేశం నిషేధం..!!
- ప్రజలకు అత్యవసర అలెర్ట్ జారీ చేసిన బహ్రెయిన్..!!
- ఒమన్‌లో దంచికొడుతున్న ఎండలు..డాక్టర్ల హెచ్చరికలు..!!
- సౌదీ, GCC పౌరులు మే 3 వరకే అవకాశం..!!
- కార్యాలయ భద్రత, అత్యవసర సంసిద్ధత పై పీహెచ్‌సీసీ ప్రకటన..!!
- తిరుమలకు చేరుకున్న ఉపరాష్ట్రపతి సి.పి.రాధకృష్ణన్
- IPL 2026: ఢిల్లీ పై బెంగళూరు ఘన విజయం









