ఉచిత ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రాకు ముందుకొచ్చిన MEIL

ఉచిత ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రాకు ముందుకొచ్చిన MEIL

హైదరాబాద్: ఆసుపత్రులకు ఉచిత ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రాకు ముందుకొచ్చింది ఎంఈఐఎల్.రోజుకు 500 సిలిండర్లు కోరుతున్నాయి ఆసుపత్రులు.అయితే డి.ఆర్.డి.వోతో కలిసి 40 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తుంది.ఒక్కొక్క ప్లాంటు నిమిషానికి 150 నుంచి 1,000 లీటర్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉండనుంది.భద్రాచలం ఐ.టి.సి నుంచి  క్రయోజనిక్ ఆక్సిజన్ దిగుమతి జరుగుతుంది.స్పెయిన్ నుంచి క్రయోజనిక్ ఆక్సిజన్ దిగుమతికి ఎంఈఐఎల్ అంగీకారం తెలిపింది. క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకుల తయారీకి సంసిద్ధత ఉంది.హైద‌రాబాద్‌లోని ప్ర‌ఖ్యాత నిమ్స్‌, అపోలో, స‌రోజినిదేవి వంటి ఆస్ప‌త్రుల నుంచి మేఘా ఇంజినీరింగ్ సంస్థ‌కు ఆక్సిజ‌న్ అందించ‌మ‌ని అభ్య‌ర్థ‌న‌లు వస్తున్నాయి.మేఘా ఇంజినీరింగ్ సంస్థ ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ల‌ను భారీ స్థాయిలో ఉచితంగా స‌ర‌ఫ‌రా చేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది.

Back to Top