జిల్లా కలెక్టర్ కు మెయిల్ ద్వారా వినతి పత్రాలు పంపిన గల్ఫ్ కార్మికులు
- May 11, 2021
తెలంగాణ: గల్ఫ్ దేశాల నుండి గత సంవత్సరం సెలవుపై స్వగ్రామానికి వచ్చి కరోనా లాక్ డౌన్ వలన ప్లయిట్స్ నిలిపివేసినందున భారత్ లో చిక్కుకుపోయిన మంచిర్యాల జిల్లా జన్నారం మండలం మహ్మదాబాద్ గ్రామానికి చెందిన ఇద్దరు గల్ఫ్ కార్మికులు కామెర రమేష్ (కువైట్) దుర్గం లక్ష్మిరాజం (ఖతార్) లు తమ జీతం బకాయిలు ఇప్పించ్చాలని వేడుకుంటున్నారు.
గల్ఫ్ లోని కంపెనీ యాజమాన్యాల నుండి తమకు రావలసిన ఎనిమిది సంవత్సరాల బోనస్, ప్రావిడెండ్ ఫండ్, గ్రాట్యుటీ లాంటి 'ఎండ్ ఆఫ్ సర్వీస్ బెనిఫిట్స్' (ఉద్యోగ ముగింపు ప్రయోజనాలు) జీత, భత్యాల బకాయిలు ఇప్పించాలని కామెర రమేష్, దుర్గం లక్ష్మిరాజంలు మంగళవారం (11.05.2021) మండల కేంద్రం జన్నారం లోని మీసేవా కేంద్రం ద్వారా మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు ఇ-మెయిల్ ద్వారా వినతి పత్రాలు పంపించారు.
మహ్మదాబాద్ గ్రామ సర్పంచి సునారికారి లక్ష్మణ్ సహకారంతో, ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్వదేశ్ పరికిపండ్ల గ్రామంలో సర్వే నిర్వహించి గల్ఫ్ నుండి వాపస్ వచ్చిన కార్మికులకు రావలసిన జీతం బకాయిలు పొందడానికి కావలసిన పత్రాలను తయారు చేయించారు.
'జస్టిస్ ఫర్ వేజ్ తెఫ్ట్' (జీతం దొంగతనం గురించి న్యాయం చేయాలి) అనే నినాదంతో కొన్ని అంతర్జాతీయ సంస్థలు చేపట్టిన ఉద్యమంలో భాగంగా తాము వాపస్ వచ్చిన వలస కార్మికులకు వారి హక్కుల గురించి అవగాహన, చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని స్వదేశ్ తెలిపారు.
విదేశాలలోని ఇండియన్ ఎంబసీలు, అంతర్జాతీయ సంస్థల సహకారంతో లేబర్ కోర్టులలో న్యాయ పోరాటానికి కావలసిన 'లీగల్ ఎయిడ్' (న్యాయ సహాయం) పొందడానికి ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. గల్ఫ్ తదితర దేశాలలోని కంపెనీల నుండి జీతం బకాయిలు రాబట్టుకోవడానికి బాధితులు తమ వివరాలను ప్రవాసి మిత్ర హెల్ప్ లైన్ వాట్సాప్ నెంబర్ +91 62817 63686 కు పంపించాలని ఆయన కోరారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







