పేదరికం లేని సమాజమే నా ఆశయం : చంద్రబాబు
- March 04, 2016
నరసరావుపేట, : నవ్యాంధ్ర అభివృద్ధికి ప్రజలు ఆలోచన చేయాలని,రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని సిఎం చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని కోటప్పకొండ వద్ద జరిగిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి సిఎం మాట్లాడారు. సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు సభకు అధ్యక్షత వహించారు.సిఎం చంద్రబాబునాయుడు మాట్లాడుతూ పేదరికం లేని సమాజమే తన ఆశయమని తెలిపారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామన్నారు. ప్రజలు తనపై నమ్మకం ఉంచి ముఖ్యమంత్రిగా నిలబెట్టారని,వారికి ఇచ్చిన వాగ్దానాలు రుణమాఫీ, డ్వాక్రా రుణాలకు చేయూత, పింఛన్ల పెంపు అమలు చేస్తున్నట్లు తెలిపారు.తెలుగువారికి శక్తితో పాటు తెలివితేటలు ఉన్నాయని, మట్టిలో మాణిక్యాలవలే ప్రపంచాన్ని తెలుగువారు శాశించే విధంగా విద్య నేర్పితే ఎదుగుతారని అన్నారు. రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా మార్చేందుకు నదుల అనుసంధానంతో పాటు రైతులకు సేద్యపు నీటి కుంటలను అమలు చేస్తున్నామన్నారు. గోదావరి, కృష్ణా నదులను పట్టిసీమ ద్వారా నదుల అనుసంధానం చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. తమ పాలనలో అద్భుతమైన రహదారులు ఉన్నాయని, విద్యుత్‌కోతలు లేవని అన్నారు. కేంద్రం నుండి నిధులు రాకున్నా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తున్నామన్నారు. దేవాలయాలు వారసత్వ సంపద అని, కోటప్పకొండను అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.కోటప్పకొండకు ప్రస్తుతం వస్తున్న ఆదాను భవిష్యత్తును రూ.15,20 కోట్లకు పెంచే విధంగా పర్యాటకంగానూ అభివృద్ధి చేస్తామన్నారు. విభజన జరిగి రాష్ట్రం సమస్యల్లో ఉందన్నారు. ఇటువంటి సమయంలో ప్రతిపక్ష పార్టీ తన స్వార్ధ రాజకీయాల కోసం అవినీతి పత్రిక ద్వారా అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధికి అడ్డుపడితే సహించేది లేదన్నారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి బహిరంగ సభా కార్యక్రమాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు.సభా వేదికపై సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావుతో పాటు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యేలు కొమ్మాలపాటి శ్రీధర్,జి.వి.ఆంజనేయులు, టిటిడి ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్, మహిళా కమిషన్ ఛైర్మన్ నన్నపనేని రాజకుమారి, జెడ్పీ ఛైర్మన్ షేక్.జానీమూన్, కలెక్టర్ కాంతిలాల్ దండే, గ్రామీణ ఎస్పీ నారాయణనాయక్ తదితరులు బహిరంగ సభలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









