రైలు ప్రయాణికులకు బీమా రక్షణ కల్పించడానికి ప్రయత్నాలు
- March 04, 2016
రైలు ప్రయాణికులకు బీమా రక్షణ కల్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని శుక్రవారం రాజ్యసభలో ప్రభుత్వం తెలిపింది. ఇందుకోసం ఏడు బీమా సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నామని రైల్వేశాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా వెల్లడించారు. పూర్తిస్థాయి నిర్ణయం జరిగాకా రైలు ప్రయాణిలకు బీమా రక్షణ లభిస్తుందని తెలిపారు. బీమా కావాలనుకునే ప్రయాణికులు టికెట్టు కొనే సమయంలోనే అదనపు రుసుంను చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు.ప్రశ్నోత్తరాల సమయంలో రైలు ప్రమాదాలపై అడిగిన అనుబంధ ప్రశ్నలకు మంత్రి సమాధానం తెలిపారు. 2012-13లో 123, 2013-14లో 118, 2014-15లో 135, 2015-16లో ఇప్పటివరకు 100 ప్రమాదాలు జరిగాయని వెల్లడించారు. పరిహారం కోసం బాధితులు దాఖలు చేసిన 579 కేసులు వివిధ రైల్వే ట్రైబ్యునల్లో అపరిష్కృతంగా ఉన్నాయని తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్







