భారత వాయుసేన భారీ సాయం
- May 13, 2021
న్యూ ఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతితో దేశంలో ఆక్సిజన్ కొరత తీవ్రమైంది.ఈ విపత్కర పరిస్థితుల్లో భారత వాయుసేన గొప్పగా సాయం చేసింది. హనుమంతుడు ‘సంజీవని’ని తీసుకొచ్చినట్లుగా వాయువేగంతో ప్రాణవాయువును సరఫరా చేసి ఎంతో మంది రోగుల ప్రాణాలు నిలబెట్టింది.42 విమానాలు 21 రోజులుగా 1400 గంటలకు పైగా ప్రయాణం చేసి దాదాపు 500 ఆక్సిజన్ ట్యాంకర్లను మోసుకొచ్చాయి.మెడికల్ ఆక్సిజన్ సరఫరా,కోవిడ్ రిలీఫ్ ఆపరేషన్స్‌లో కోసం వాయుసేన 42 విమానాలను ఏర్పాటు చేసింది.ఈ మెగా ఆపరేషన్‌లో ఆరు సి-17, ఆరు ఇల్యూషిన్-76 విమానాలు, 30 మీడియం లిఫ్ట్ సి-130జేఎస్ విహంగాలు భాగస్వాములయ్యాయి. ఈ విమానాలు దేశం లోపల, విదేశాల నుంచి ఆక్సిజన్ ట్యాంకర్లను సరఫరా చేశాయి. ‘‘దేశీయంగా.. మా పైలట్లు 939 గంటల పాటు 634 ప్రయాణాలు జరిపి 403 ఆక్సిజన్ కంటైనర్లు, 163.3 మెట్రిక్ టన్నుల ఇతర వైద్య పరికరాలను ఆసుపత్రులకు చేర్చాయి’’ అని ఐఏఎఫ్ అధికారులు వెల్లడించారు. ఆక్సిజన్, ఇతర సహాయ పరికరాల కోసం ఐఏఎఫ్ విమానాలు.. జర్మనీ, ఇండోనేషియా,ఆస్ట్రేలియా, బ్రిటన్,సింగపూర్ ఇలా 9 దేశాలకు వెళ్లాయి. అంతర్జాతీయంగా ఈ విమానాలు 480 గంటల పాటు 98 ప్రయాణాలు జరిపి 95 ప్రాణవాయువు కంటైనర్లను విదేశాల నుంచి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో పాటు 200 టన్నుల రిలీఫ్ మెటీరియల్‌ను కూడా మోసుకొచ్చినట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ 21 నుంచి వాయుసేన ఈ ప్రత్యేక విమానాలను నడిపింది.సిబ్బందిని వైరస్ నుంచి రక్షించేందుకు బయో బబుల్ కూడా ఏర్పాటు చేసింది.
తాజా వార్తలు
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్‌షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్‌హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్‌నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్
- పిల్లలను కొట్టొద్దు..పేరెంట్స్ కు దుబాయ్ పోలీసులు సలహా..!!
- 24వేల రవాణా సంస్థలను హెచ్చరించిన TGA..!!
- టూర్ ఆఫ్ ఫ్లాండర్స్ సైక్లిస్టులకు జరిమానాలు..!!
- వదంతులను నమ్మొద్దు..ప్రజలకు క్యాబినెట్ విజ్ఞప్తి..!!
- ఖతార్ లో విద్యాసంస్థల సెలవులు పొడిగింపు..!!









