గల్ఫ్ ప్రయాణీకులకు లాక్ డౌన్ పాసుల సౌకర్యాని కై వినతి
- May 13, 2021
● తెలంగాణ పోలీస్ పోర్టల్ లో అంతర్జాతీయ ప్రయాణీకుల కాలమ్ ను చేర్చాలి
హైదరాబాద్: హైదరాబాద్ విమానాశ్రయం నుంచి గల్ఫ్ తదితర దేశాలకు రాకపోకలు సాగించే అంతర్జాతీయ ప్రయాణీకులకు లాక్ డౌన్ పాసుల జారీకి దరఖాస్తు చేసే పోలీస్ పోర్టల్ లో "అంతర్జాతీయ ప్రయాణీకులు" అనే కాలమ్ ను చేర్చాలని ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షులు మంద భీంరెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు గురువారం (13.05.2021) ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి, మంత్రి కేటీఆర్, తెలంగాణా ఎన్నారై విభాగాలకు ఇ-మెయిల్ ద్వారా వినతి పత్రం పంపారు.
లాక్ డౌన్ ఇ-పాస్ కావలసినవారు... వ్యవసాయ సంబంధిత కార్యకలాపాలు, బ్యాంకింగ్ / ఇన్సూరెన్స్ / ఎటిఎం సేవలు, సివిల్ వర్క్స్ / మెటీరియల్ రవాణా / కుటుంబంలో ఎవరైనా చనిపోయిన / ఇ-కామర్స్ పంపిణీ సేవలు, అత్యవస సేవల ఉద్యోగి, మెడికల్ ఎమర్జెన్సీ, హాస్పిటల్‌కు వెళ్లడానికి మెడికల్ ఎమర్జెన్సీ, డయాగ్నొస్టిక్ సెంటర్‌కు వెళ్లడానికి మెడికల్ ఎమర్జెన్సీ, మెడికల్ టీకా కేంద్రం, మెడికల్ అండ్ ఫార్మా సర్వీసెస్, ఉపాధి హామీ పనులు, పేషేంట్ సహాయకులు, ఫార్మా, గర్భవతులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రైవేట్ సెక్యూరిటీ సర్వీసెస్, అనుమతి పొందిన వివాహాలు, అనుమతి పొందిన కార్యకలాపాలు, పారిశుధ్య సేవలు, చిక్కుకుపోయిన కార్మికులు, చిక్కుకుపోయిన కుటుంబాలు, వ్యవసాయ సంబంధిత రవాణా, ముఖ్యమైన వస్తువుల రవాణా, ఔషధ రవాణా, ఆక్సిజన్, వ్యాక్సిన్ మొదలైనవి, టెలికం / ఇంటర్నెట్ / పోస్టల్ సేవలకు సంబందించిన కారణాలను పేర్కొంటూ తెలంగాణా పోలీస్ పోర్టల్ https://policeportal.tspolice.gov.in/ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో "అంతర్జాతీయ ప్రయాణీకుల" కాలమ్ ను చేర్చాలని ఆ వినతి పత్రంలో కోరారు.
అంతర్జాతీయ ప్రయాణీకులకు పాసులు జారీ చేసేటప్పుడు పాసుపోర్టు, వీసా, టికెట్టు, బోర్డింగ్ పాసు లాంటి ఆధారాలను సరిచూసుకోవచ్చని భీంరెడ్డి అన్నారు. గల్ఫ్ దేశాలకు ఉద్యోగానికి వెళ్ళే కార్మికులు కొందరు రూ. 60 వేలు చెల్లించి క్వారంటైన్ సౌకర్యాన్ని కూడా బుక్ చేసుకున్నారని, సకాలంలో ప్రయాణం చేయకపోతే డబ్బుతోపాటు ఉద్యోగ అవకాశాలు కూడా కోల్పోతారని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







