యువరత్న బాలకృష్ణతో 101వ సినిమా : సత్యదేవా
- March 04, 2016
యువరత్న నందమూరి బాలకృష్ణతో 101వ సినిమా తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని దర్శకుడు వక్కపట్ల సూర్య వెంకట సత్యనారాయణమూర్తి (సత్యదేవా) తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలోని తన స్వగ్రామమైన పినపళ్లలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఇప్పటికే బాలకృష్ణతో తీసిన 'లయన్' సినిమా నిర్మాతకు మంచి లాభాలు తెచ్చిపెట్టిందని, టేకింగ్‌పరంగా తనకు మంచి గుర్తింపు తెచ్చిందని అన్నారు.ప్రస్తుతం బాలకృష్ణ 100వ చిత్రంగా కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం తరువాత తన సినిమా ఉంటుందన్నారు. అలాగే ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు నిర్మాతగా పవన్ కళ్యాణ్ హీరోగా తీసే సినిమాకు కథా చర్చలు తుది దశకు చేరుకున్నాయన్నారు.పుష్కరకాలం క్రితం దర్శకరత్న దాసరికి పరిచయం చేసి, తనకు సినీ జీవితాన్నిచ్చిన మాజీ మంత్రి సంగిత వెంకటరెడ్డి తనకు గురుతుల్యులన్నారు. దర్శకుడు సత్యదేవాతో ఫొటోలు తీయించుకునేందుకు పలువురు పోటీ పడ్డారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







