కోవిడ్ 19: వ్యాక్సినేషన్ పొందినవారికి 5 ఈవెంట్లు, యాక్టివిటీలు
- May 17, 2021
దుబాయ్: రెసిడెంట్లు అలాగే విజిటర్స్ కోసం దుబాయ్ అథారిటీస్ కొన్ని ఈవెంట్లు, యాక్టివిటీస్ ప్రారంభిస్తున్నాయి. మే 17 నుంచి ఇవి ప్రారంభమయ్యాయి. అయితే, ఇవన్నీ వ్యాక్సినేషన్ పొందినవారికి మాత్రమే. ఖచ్చితమైన ప్రికాషన్స్ తీసుకుంటూ వీటిని నిర్వహిస్తారు. దుబాయ్ సుప్రీం కమిటీ వెల్లడించిన వివరాల ప్రకారం, లైవ్ ఎంటర్టైన్మెంట్ మరియు యాక్టివిటీస్.. అనుమతించబడతాయి.. రెస్టారెంట్లు, కేఫ్ లు అలాగే షాపింగ్ మాల్స్ వంటి వాటిల్లో. కానీ, ప్రదర్శన చేసేవారు ఖచ్చితంగా కోవిడ్ వ్యాక్సినేషన్ పొంది వుండాలి. కాన్సెర్టులు మరియు ఈవెంట్స్ విషయానికొస్తే, గలా డిన్నర్లు మరియు అవార్డు కార్యక్రమాలు సైతం ఇదే నిబంధన వర్తిస్తుంది. హాజరయ్యేవారు, పార్టిసిపెంట్లు.. అందరూ వ్యాక్సినేషన్ పొంది వుండాలి. వెడ్డింగ్స్ విషయానికి వస్తే, 100 మందికి అవకాశమిస్తారుగానీ.. హాజరయ్యేవారు, స్టాఫ్ (ఆయా హోటళ్ళకు సంబంధించి) వ్యాక్సినేషన్ పొంది వుండాలి. బార్లకూ ఇదే వర్తిస్తుంది. స్పోర్ట్స్ ఈవెంట్స్ విషయానికొస్తే పార్టిసిపెంట్లు, హాజరయ్యేవారు వ్యాక్సినేషన్ పొంది వుండాల్సిందే. 2021 నాటికి అందరికీ వ్యాక్సినేషన్ అందించడమే లక్ష్యంగా దుబాయ్ అథారిటీస్ పనిచేస్తున్నాయి.
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









