నేడు ఉప రాష్ట్రపతి హైదరాబాద్ పర్యటన
- March 04, 2016
ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ శనివారం హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. ఉప రాష్ట్రపతి మొదట రాజ్‌భవన్ నుంచి పాత నగరంలోని తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌కు విచ్చేస్తారు. అనంతరం శని, ఆదివారాల్లో నగరంలోని చార్మినార్, కుతుబ్ షాహీ సమాధులు తదితర పర్యాటక కేంద్రాలను సందర్శిస్తారు. ఈ నేపథ్యంలో శుక్రవారం పోలీస్ శాఖ రాజ్‌భవన్ నుంచి 30కి పైగా వాహనాల శ్రేణితో తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్ వరకు అక్కడి నుంచి కుతుబ్‌షాహీ సమాధుల వరకు కాన్వాయ్ రిహార్సల్స్ నిర్వహించింది. ఈ సందర్భంగా కాన్వాయ్ సాగే రహదారుల వెంట ఆయా పోలీసుస్టేషన్ల పోలీసులు బందోబస్తు నిర్వహించి ట్రాఫిక్‌ను నిలిపివేశారు.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







