3 ఆఫ్రికా దేశాలకు ప్రయాణాలపై సౌదీ అరేబియా నిషేధం..!!
- June 26, 2026
రియాద్: ఎబోలా వైరస్ వ్యాప్తిని నివారించే ముందుజాగ్రత్త చర్యలలో భాగంగా కాంగో, ఉగాండా మరియు దక్షిణ సూడాన్‌లకు ప్రయాణించడాన్ని సౌదీ అరేబియా నిలిపివేసింది. అదే సమయంలో ఈ మూడు దేశాల నుండి వచ్చే వారికి సైతం అన్ని రకాల వీసాల జారీని కూడా నిలిపివేసింది.
ఎబోలా వ్యాప్తికి సంబంధించిన ప్రమాదాలను తగ్గించడానికి తీసుకుంటున్న అదనపు ముందుజాగ్రత్త చర్యలలో ఇవి కూడా భాగమని ప్రకటించింది. కొత్తగా ప్రవేశపెట్టిన ఈ ఆంక్షలు, సౌదీలోకి ప్రవేశించడానికి 21 రోజుల ముందు వరకు ఈ మూడు ప్రభావిత దేశాలలో పర్యటించిన ఇతర దేశాల ప్రయాణికులకు కూడా వర్తిస్తాయని స్పష్టం చేసింది.
సౌదీలో ప్రజారోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని, ఎబోలాకు సంబంధించిన నిర్ధారిత లేదా అనుమానిత కేసులు ఏవీ నమోదు కాలేదని పేర్కొంది.
తాజా వార్తలు
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!
- యువతలో పెరుగుతున్న కొలొరెక్టల్ క్యాన్సర్‌కు వాపు కారణమా?
- బహ్రెయిన్‌లో స్మగ్లింగ్.. శరీరంలో 22 క్యాప్సూల్స్.. జీవిత ఖైదు..!!
- ఏషియన్ గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన నీరూదండా..
- భారత్–యూఏఈ రక్షణ సహకారం పై కీలక చర్చలు..







