బ్యాంకులు మరో ఆరు నెలలపాటు ఇన్స్టాల్మెంట్స్ వాయిదా వేయాలి: ఎంపీ

- May 18, 2021 , by Maagulf
బ్యాంకులు మరో ఆరు నెలలపాటు ఇన్స్టాల్మెంట్స్ వాయిదా వేయాలి: ఎంపీ

బహ్రెయిన్: బ్యాంకులు మరో ఆరు నెలలపాటు ఇన్స్టాల్మెంట్స్ వాయిదా వేయాల్సిందిగా ప్రభుత్వం అలాగే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్ (సిబిఎన్)ని ఎంపీ ఇబ్రహీమ్ ఖాలిద్ అల్ నఫ్లీ కోరారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఇది చాలా అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. చాలామంది కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని ఎంపీ ప్రస్తావించారు. చెల్లింపుల్ని వాయిదా వేసేలా బ్యాంకులు వెసులుబాటు కల్పిస్తే, చాలామందికి ఆర్థికంగా అది ఊరటనిస్తుందని అన్నారు. గత మార్చిలో కరోనా నేపథ్యంలో బా్యంకు లోన్ల పేమెంట్స్ విషయమై బహ్రెయినీలకు ఆరు నెలలపాటు వెసులుబాటు కల్పించారు. క్రెడిట్ కార్డులకు వెసులుబాటు కల్పించినా ఇంటర్ బ్యాంకు డిపాజిట్లు, అప్పులకు దీన్ని వర్తింపజేయలేదు. కాగా, బహ్రెయిన్ గత మార్చిలో 4.3 బిలియన్ బహ్రెయినీ దినార్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com