హ్యూమన్ ట్రాఫికింగ్ మీద అవగాహనా కార్యక్రమాలు

- May 18, 2021 , by Maagulf
హ్యూమన్ ట్రాఫికింగ్ మీద అవగాహనా కార్యక్రమాలు

మస్కట్: గత ఏడాది, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇంక్వైరీస్ మరియు ఇన్వెస్టిగేషన్స్, పలు హ్యూమన్ ట్రాఫికింగ్ నేరాల్ని ఛేదించగలిగింది. ఎంప్లాయర్ల నుంచి వివిధ కారణాలతో తప్పించుకుపోయినవారిని లక్ష్యంగా చేసుకుని ఈ నేరాలు జరుగుతున్నాయి. ఇలాంటి వాటిని అంతమొందించేందుకోసం అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నామని రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. జాతీయ స్థాయిలో ఓ అవగాహనా కార్యక్రమాన్ని మరింత పకడ్బందీగా చేపట్టేందుకు నేషనల్ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు అథారిటీస్ వెల్లడించాయి. ‘ఇన్సాన్’ నినాదంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ కమిటీలో పలు ప్రభుత్వ మరియు ప్రైవేటు ఏజెన్సీలు భాగం పంచుకుంటాయి. అనుమానిత ట్రాఫికింగ్ నేరాలపై ఫిర్యాదు చేసేందుకోసం టోల్ ఫ్రీ నెంబర్ 80077444 లేదా వెబ్ సైట్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చునని రాయల్ ఒమన్ పోలీస్ సూచిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com