తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ అమలు..
- May 18, 2021
హైదరాబాద్: తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ ఎందుకు అమలు చేయడం లేదంటూ ఎప్పటి నుంచి విమర్శలు ఉన్నాయి.ముఖ్యంగా కరోనా మహమ్మారి సమయంలో.. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ సర్కార్‌ను టార్గెట్ చేశారు బీజేపీ నేతలు..అసలు ఆయుష్మాన్ భారత్ అమలు చేయడానికి ఉన్న ఇబ్బందులు ఏంటి? అంటూ నిలదీశారు. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు..రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ అమలు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ. దీంతో..ఆయుష్మాన్ భారత్ అమల్లో తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసిందనే చెప్పాలి..రాష్ట్ర వైద్యారోగ్యశాఖ, నేషనల్ హెల్త్ అథారిటీతో ఎంవోయూ కుదుర్చుకుంది.. తదనుగుణంగా ఆయుష్మాన్ భారత్ పథకం అమలుకు సంబంధించిన విధి విధానాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఖారారు చేసింది.ఆయుష్మాన్ భారత్ నియమ నిబంధనలను అనుసరిస్తూ..రాష్ట్రంలో వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలంటూ సంబంధిత అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్‌తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భేటీ..!!
- జెడ్డాకు విమాన సర్వీసులు తగ్గించిన ఖతార్ ఎయిర్వేస్..!!
- విదేశాల్లో వివాహం..ఒమన్ పౌరులకు ప్రీ-మ్యారిటల్ వైద్య పరీక్షలు తప్పనిసరా?
- యూఏఈలో ఆన్లైన్లో అవమానిస్తే జైలుశిక్ష.. Dh500,000 వరకు జరిమానా..!
- మిస్ కేరళ 2026.. కువైట్‌కు చెందిన భారతీయ యువతికి రన్నరప్ టైటిల్..!!
- కువైట్‌లో ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త డి.వి. మల్హోత్రా కన్నుమూత..!!
- బహ్రెయిన్‌లో ఘనంగా ‘శారదోత్సవ్ 2026’ ప్రారంభం..!!
- జెడ్డాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ప్రిన్స్ మజీద్ రోడ్డు విస్తరణ..!!
- యూఏఈ–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి







