NTPC లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు
- May 19, 2021
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థ అయిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఈనెల 21న ప్రారంభమై వచ్చే నెల 10న ముగుస్తుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 280 ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులు ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ విభాగాల్లో ఖాళీగా ఉన్నాయి. గేట్ స్కోర్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తుంది.
మొత్తం పోస్టులు: 280
అర్హతలు: బీటెక్ లేదా బీఈలో ఎలక్టిల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, పవర్ సిస్టమ్స్ అండ్ హై వోల్టేజ్, మెకానికల్, ప్రొడక్షన్, ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్, ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్, థర్మల్, మెకానికల్ అండ్ ఆటోమేషన్, పవర్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ పవర్, పవర్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ కోర్సుల్లో ఏదో ఒకటి చేసి ఉండాలి. అభ్యర్థులు 27 ఏండ్ల లోపువారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: గేట్ 2021 స్కోర్, ఇంటర్వ్యూ, గ్రూప్‌డిస్కషన్ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులు ప్రారంభం: మే 21
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 10
వెబ్సైట్: www.ntpccareer.net
తాజా వార్తలు
- అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
- ముంబై రన్‌వే పై ఎదురెదురుగా ఎయిరిండియా విమానాలు..
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్‌ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్‌పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్‌ఫామ్‌కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక







