ప్రైవేట్ స్కూల్స్ లో అరబిక్, ఇస్లామిక్ ఎడ్యూకేషన్ తప్పనిసరి చేసిన ఖతార్
- May 20, 2021
ఖతార్: దేశంలోని అన్ని ప్రైవేట్ స్కూల్స్ లో ఇక నుంచి అరబిక్, ఇస్లామిక్ విద్య, ఖతార్ చరిత్ర సిలబస్ లో తప్పనిసరిగా బోధించాలని ఖతార్ విద్యాశాఖ ఆదేశించింది. ఈ మేరకు అకాడమిక్ పాలసీ-2021 ను అప్ డేట్ చేసింది. ప్రతీ ప్రైవేట్ స్కూల్, కిండర్ గార్టెన్ లో ఈ మూడు సబ్జెక్టులు బోధనాంశాలుగా ఉండాలని విద్య, ఉన్నత విద్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ మేరకు అన్ని ప్రైవేట్ స్కూల్స్, కిండర్ గార్టెన్ యాజమాన్యాలకు ఉత్తర్వ్యులు జారీ చేసింది. అన్ని ప్రీ స్కూళ్లలో అరబిక్ భాషతో పాటు ఇస్లామిక్ విద్య ఈ రెండు సబ్జెక్టులు తప్పనిసరిగా ఉండాలని ఉత్తర్వ్యుల్లో స్పష్టం చేసింది. ఇక ఉన్నత విద్యలో అరబిక్, ఇస్లామిక్ విద్యతో పాటు ఖతార్ చరిత్ర...ఈ మూడు సబ్జెక్టులు ఉండాలని వెల్లడించింది. గ్రేడ్ 1 నుంచి 12 వరకు పైన పేర్కొన్న అంశాలు విద్యావిధానంలో తప్పనిసరిగా చేర్చాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







