'ఎన్టీఆర్30' నుంచి స్టైలిష్ పోస్టర్ విడుదల…
- May 20, 2021
హైదరాబాద్: ఈ రోజు జూ.ఎన్టీఆర్ పుట్టినరోజు. సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ కు ఆయన అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోంది. ఇలాంటి సమయంలో వేడుకలు జరుపుకోవడం కరెక్ట్ కాదని, అభిమానులు తన పుట్టినరోజు వేడుకలు జరపొద్దని, అవసరమైతే కరోనా బాధితులకు అండగా నిలవాలని కోరారు. ఇక ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ నుంచి విడుదలైన ఎన్టీఆర్ లుక్ కు అద్భుతమైన స్పందన వస్తోంది. తాజాగా “ఎన్టీఆర్ 30” మేకర్స్ తారక్ స్టైలిష్ పోస్టర్ ను విడుదల చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. “ఎన్టీఆర్30″ని నిర్మిస్తున్న యువసుధ ఆర్ట్స్ బ్యానర్ నిర్మాతలు ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ తో ఆయన అభిమానులను సర్పైజ్ చేశారు. ఈ పోస్టర్ సినిమాలోనిది కానప్పటికీ ఎన్టీఆర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక ‘ఆర్ఆర్ఆర్’ నుంచి విడుదలైన లుక్, ఎన్టీఆర్ 30 పోస్టర్స్ లో తారక్ లుక్ డిఫరెంట్ గా ఉంది. “ఎన్టీఆర్30″కి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా… కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
తాజా వార్తలు
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ







