ఏపీ బడ్జెట్ హైలైట్స్..
- May 20, 2021
అమరావతి: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఒకరోజు అసెంబ్లీ సమావేశం ప్రారంభమైంది. అసెంబ్లీలో గురువారం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ 2021-22 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రాష్ట్ర బడ్జెట్ అంచనా రూ.2,29,779.27 కోట్లుగా తెలిపారు. ఈ బడ్జెట్లో సంక్షేమానికి పెద్ద పీట వేశారు. బీసీ ఉప ప్రణాళికకు రూ.28,237 కోట్లు, కాపు సంక్షేమానికి రూ.3,306 కోట్లు, ఈబీసీ సంక్షేమానికి రూ.5,478 కోట్లు, బ్రాహ్మణ సంక్షేమానికి రూ.359 కోట్లు, ఎస్సీ సబ్‌ప్లాన్‌కు రూ.17,403 కోట్లు, ఎస్టీ సబ్ ప్లాన్‌కు రూ.6,131 కోట్లు బడ్జెట్లో వెచ్చించారు. వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి కన్నబాబు ప్రవేశపెట్టున్నారు. సభ ప్రారంభం కాగానే పలువురు మాజీ ఎమ్మెల్యేల మృతిపట్ల అసెంబ్లీ సంతాపం తెలిపింది.
బడ్జెట్ కేటాయింపులు ఇలా
బీసీ ఉప ప్రణాళిక: రూ.28,237 కోట్లు
ఎస్సీ ఉప ప్రణాళిక: రూ.17,403 కోట్లు
ఎస్టీ ఉప ప్రణాళిక: రూ.6,131 కోట్లు
కాపు సంక్షేమం: రూ.3,306 కోట్లు
ఈబీసీ సంక్షేమం: రూ.5,478 కోట్లు
బ్రాహ్మణ సంక్షేమం: రూ.359 కోట్లు
మైనార్టీ యాక్షన్ ప్లాన్: రూ.1,756 కోట్లు
చిన్నారుల కోసం రూ.16,748 కోట్లు
మహిళల అభివృద్ధి: రూ.47,283.21 కోట్లు
వ్యవసాయ పథకాలు: రూ.11,210 కోట్లు
విద్యా పథకాలు: రూ.24,624 కోట్లు
వైద్యం, ఆరోగ్యం: రూ.13,830 కోట్లు
వైఎస్సార్ పింఛన్ కానుక: రూ.17 వేల కోట్లు
వైఎస్సార్ రైతు భరోసా: రూ.3,845 కోట్లు
జగనన్న విద్యా దీవెన: రూ.2,500 కోట్లు
జగనన్న వసతి దీవెన: రూ.2,223.15 కోట్లు
వైఎస్సార్-పీఎం ఫసల్ బీమా: రూ.1802 కోట్లు
డ్వాక్రా సంఘాల సున్నా వడ్డీ చెల్లింపులు: రూ.865 కోట్లు
పట్టణ ప్రాంత డ్వాక్రా మహిళలు: రూ.247 కోట్లు
రైతులకు సున్నా వడ్డీ చెల్లింపులు: రూ.500 కోట్లు
వైఎస్సార్ కాపు నేస్తం కోసం రూ.500 కోట్లు
వైఎస్ఆర్ జగనన్న చేదోడు పథకానికి రూ.300 కోట్లు
వైఎస్ఆర్ వాహన మిత్ర కోసం రూ.285 కోట్లు
వైఎస్ఆర్ నేతన్న నేస్తం కోసం రూ.190 కోట్లు
వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కోసం రూ.120 కోట్లు
మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ కోసం రూ.50 కోట్లు
అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లింపుల కోసం రూ.200 కోట్లు
రైతులకు ఎక్స్‌గ్రేషియా కోసం రూ.20 కోట్లు
లా నేస్తం కోసం రూ.16.64 కోట్లు
ఈబీసీ నేస్తం కోసం రూ.500 కోట్లు
వైఎస్ఆర్ ఆసరా కోసం రూ.6,337 కోట్లు
అమ్మఒడి పథకం కోసం రూ.6,107 కోట్లు
వైఎస్ఆర్ చేయూత కోసం రూ.4,455 కోట్లు
రైతు పథకాల కోసం రూ.11,210.80 కోట్లు
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







