అజాన్ తర్వాత వేచి వుండే సమయాన్ని పెంచిన అవ్కాఫ్
- May 20, 2021
దోహా: కోవిడ్ 19 కొత్త కేసుల తగ్గుదల నేపథ్యంలో మినిస్ట్రీ ఆఫ్ అవ్కాఫ్ మరియు ఇస్లామిక్ ఎఫైర్స్, అజాన్ తర్వాత పది నిమిషాలకు ప్రార్థనలు ప్రారంభమవుతాయని వెల్లడించింది. వేచి వుండే సమయాన్ని ఐదు నిమిషాల నుంచి పది నిమిషాలకు పెంచారు. రెండో అజాన్ కంటే 20 నిమిషాల ముందు శుక్రవారం ప్రార్థనల కోసం మసీదులు తెరవబడతాయి. ఈ మేరకు తాజాగా మసీదుల మేనేజ్మెంట్ డిపార్టుమెంట్, ఇమామ్స్ అలాగే మ్యుజ్జిన్స్ లకు సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాల్సిందిగా సర్క్యులర్ ద్వారా పేర్కొన్నారు. వ్యక్తిగత ప్రేయర్ మ్యాట్ వెంట తెచ్చుకోవడం, ఫేస్ మాస్క్ ధరించడం, ఎహ్తెరాజ్ గ్రీన్ స్టేటస్ చూపించడం, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం వంటివి తప్పనిసరి.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
- ముంబై రన్‌వే పై ఎదురెదురుగా ఎయిరిండియా విమానాలు..
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్‌ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్‌పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్‌ఫామ్‌కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక







