కర్ణాటకలో లాక్ డౌన్ పొడిగింపు..!
- May 21, 2021
బెంగుళూరు: కర్ణాటకలో కరోనా ఉదృతి కొనసాగుతున్న నేపధ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.జూన్ 7 వరకు లాక్ డౌన్ పొడిగిచింది. కర్ణాటకలో మే 10 నుంచి లాక్ డౌన్ అమలవుతుంది. ముందుగా మే 24 వరకూ లాక్ డౌన్ నిర్ణయించాలని నిర్ణయించారు. కరోనా వ్యాప్తి అదుపులోకి రాకపోవడంతో తాజాగా దాన్ని మరో రెండువారాలు పెంచారు. కర్ణాటకలో కొత్తగా 32,218 కరోనా కేసులు నమోదు కాగా 353మరణాలు సంభవించాయి. ఇక లాక్ డౌన్ మార్గదర్శకాలలో ఎటువంటి మార్పులు లేవని, అయితే ప్రజలు లాక్ డౌన్ నిబంధనలను పాటించడం లేదని, ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడానికి పోలీసు అధికారులను అనుమతించామని ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప తెలిపారు. నిత్యావసర వస్తువులకి అక్కడ ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల సమయం వరకు అనుమతి ఇచ్చారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







