కోవిడ్ చికిత్సకు ఆర్.యం.పీ,పి.యం.పీ లకు అనుమతి లేదు:కలెక్టర్ ఇంతియాజ్
- May 21, 2021
విజయవాడ: జిల్లాలో ఆర్.యం.పీ,పి.యం.పీ లు కోవిడ్ వైద్యానికి పాల్పడితే భారత శిక్షస్పృతి కోడ్ 1860 ప్రకారం క్రిమినల్ కేసు నమోదు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఏ.యండి.ఇంతియాజ్ ఒక ప్రకటన లో తెలిపారు.
ఆర్.యం.పీ,పి.యం.పీ లకు కోవిడ్ చికిత్సకు ఎపిడిమిక్ డీసీజస్ యాక్ట్ 1897,యాక్ట్ నెం.3 అఫ్ 1897 ప్రకారం అనుమతి లేదని స్పష్టం చేశారు.కోవిడ్ సంబంధింత లక్షణాలు బ్రాంకీయల్ అస్మా,ఎల్ విఎఫ్,ఏఆర్ డి,శారి,ఎక్యూట్ మమో కార్డియల్ ఇన్ఫెక్షన్, ఇతర అటువంటి చిహ్నాలు ఉన్న యెడల గుర్తింపు పొందిన ప్రభుత్వ ఆస్పత్రిలో,గుర్తింపు పొందిన ప్రైవేట్ కోవిడ్ ఆస్పత్రిలో మాత్రమే చికిత్స అందించాలన్నారు.
కావున పైన పేర్కొన్న కేసులకు ఆర్.యం.పీ,పి.యం.పీలు వైద్యం చేయకుండా గుర్తింపు పొందిన ప్రభుత్వ ఆస్పత్రులకు, కోవిడ్ ప్రైవేట్ ఆస్పత్రులకు పంపించాలన్నారు. అలా కాకుండా కోవిడ్ చికిత్సకు పాల్పడితే భాద్యులపై క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుందని కలెక్టర్ ఏ.యండి. ఇంతియాజ్ ఆ ప్రకటనలో హెచ్చరించారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







