సోషల్ మీడియా సంస్థలకు కేంద్రం కీలక ఆదేశాలు..
- May 22, 2021
న్యూ ఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ భారత్‌లో కల్లోలం సృష్టిస్తోన్న సమయంలో.. భారత్‌లో కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చాయంటూ ప్రచారం జరిగింది.ముఖ్యంగా.. కరోనా బీ.1.617 వేరియంట్‌ను భారత్ వేరియంట్‌గా పలు కథనాలు వచ్చాయి.ఈ నేపథ్యంలో సోషల్ మీడియా సంస్థలను కీలక ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం..WHO తమకు సంబంధించిన ఏ నివేదికలోనూ భారత్ వేరియంట్ అనే పదాన్ని వాడలేదని, ఇది పూర్తిగా తప్పుడు సమాచారమంటూ ఆయా సంస్థలకు కేంద్ర ఐటీ శాఖ లేఖ రాసింది.ఇక, ఇదే సమయంలో భారత్ కరోనా వేరియంట్.. ప్రపంచ దేశాల్లో విస్తరిస్తోందని తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతోందని.. బీ.1.617 వేరియంట్‌పై ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖ వివరణ కూడా ఇచ్చిందని లేఖలో పేర్కొంది కేంద్ర ఐటీశాఖ.
కాగా, బీ.1.617 వేరియంట్ కరోనా వైరస్ సూపర్ ఫాస్ట్‌గా విస్తరిస్తూ.. చాలా ప్రాణాలను తీసింది.ఇది, భారత్ వేరియంట్‌గా WHO పేర్కొన్నట్లు మీడియాలోనూ అనేక కథనాలు వచ్చాయి.కానీ, బీ.1.617 అనేది భారత్ వేరియంట్ అని చెప్పేందుకు ఎక్కడా ఆధారాలు లేవని, ఇలాంటి తప్పుడు కథనాలు ప్రచురించే ముందు మీడియా జాగ్రత్త వ్యవహరించాలని ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.ఇప్పుడు, సోషల్ మీడియా సంస్థలకు కూడా లేఖలు రాసింది.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్‌ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







