సోషల్‌ మీడియా సంస్థలకు కేంద్రం కీల‌క ఆదేశాలు..

- May 22, 2021 , by Maagulf
సోషల్‌ మీడియా సంస్థలకు కేంద్రం కీల‌క ఆదేశాలు..

న్యూ ఢిల్లీ: క‌రోనా సెకండ్ వేవ్ భార‌త్‌లో క‌ల్లోలం సృష్టిస్తోన్న స‌మ‌యంలో.. భార‌త్‌లో కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చాయంటూ ప్ర‌చారం జ‌రిగింది.ముఖ్యంగా.. క‌రోనా బీ.1.617 వేరియంట్​ను భార‌త్ వేరియంట్‌గా ప‌లు క‌థ‌నాలు వ‌చ్చాయి.ఈ నేప‌థ్యంలో సోషల్‌ మీడియా సంస్థలను కీల‌క ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్ర‌భుత్వం..WHO తమకు సంబంధించిన ఏ నివేదికలోనూ భార‌త్ వేరియంట్‌ అనే పదాన్ని వాడలేదని, ఇది పూర్తిగా తప్పుడు సమాచార‌మంటూ ఆయా సంస్థలకు కేంద్ర ఐటీ శాఖ లేఖ రాసింది.ఇక‌, ఇదే స‌మ‌యంలో భారత్ క‌రోనా వేరియంట్..‌ ప్రపంచ దేశాల్లో విస్తరిస్తోందని తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతోంద‌ని.. బీ.1.617 వేరియంట్‌పై ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖ వివరణ కూడా ఇచ్చింద‌ని లేఖ‌లో పేర్కొంది కేంద్ర ఐటీశాఖ‌.

కాగా, బీ.1.617 వేరియంట్ క‌రోనా వైర‌స్ సూప‌ర్ ఫాస్ట్‌గా విస్త‌రిస్తూ.. చాలా ప్రాణాల‌ను తీసింది.ఇది, భార‌త్ వేరియంట్‌గా WHO పేర్కొన్నట్లు మీడియాలోనూ అనేక కథనాలు వ‌చ్చాయి.కానీ, బీ.1.617 అనేది భార‌త్ వేరియంట్ అని చెప్పేందుకు ఎక్కడా ఆధారాలు లేవని, ఇలాంటి తప్పుడు కథనాలు ప్రచురించే ముందు మీడియా జాగ్రత్త వ్య‌వ‌హ‌రించాల‌ని ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖ స్ప‌ష్టం చేసింది.ఇప్పుడు, సోష‌ల్ మీడియా సంస్థ‌ల‌కు కూడా లేఖ‌లు రాసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com