ట్రావెల్ బ్యాన్ నుంచి 5 వర్గాలకు మినహాయింపు
- May 22, 2021
కువైట్ సిటీ: కువైట్ పౌరులు, వారి రక్తసంబంధీకుల విదేశీ ప్రయాణాలపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కీలక సూచనలు చేసింది. కువైట్ గుర్తింపు పొందిన కోవిడ్ వ్యాక్సిన్ ఫైజర్, అస్ట్రాజెన్కా, మోడెర్నా, జాన్సన్&జాన్సన్ లలో ఏదో ఒక వ్యాక్సిన్ను పూర్తి డోసులు తీసుకున్న వారికి మాత్రమే విదేశాలకు వెళ్లేందుకు అనుమతించనున్నట్లు స్పష్టం చేసింది. అయితే..ఈ నిబంధనల నుంచి ఐదు వర్గాలకు మాత్రం మినహాయింపు ఇచ్చింది.
1. ఆరోగ్య కారణాల రిత్యా వ్యాక్సిన్ తీసుకునేందుకు అనర్హులుగా నిర్ధారిస్తూ ఆరోగ్య శాఖ సర్టిఫికెట్ పొందినవారు.
2. గర్భిణిలు.(గర్భంతో ఉన్నట్లు ఆరోగ్య శాఖ ఆమోదించిన సర్టిఫికెట్ తప్పనిసరి)
3. వ్యాక్సిన్ నుంచి మినహాయింపు పొందిన వయసువారు.
4. విదేశాల్లో చదువుకునే విద్యార్ధులు. తాము విదేశాల్లో చదువుతున్నట్లు ఆధారాలు చూపించాలి. అదే సమయంలో కనీసం ఒక డోసు వ్యాక్సిన్ అయినా తీసుకొని ఉండాలి.
5. కువైట్ గుర్తింపు పొందిన దౌత్యపరమైన వ్యవహారాలకు సంబంధించి ప్రయాణాలకు మినహాయింపు ఉంటుంది.
ఇదిలాఉంటే...Kuwaitmosafer యాప్ లేదా వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకుంటేనే కువైట్ నుంచి వెళ్లేందుకుగానీ, కువైట్ కు వచ్చేందుకుగానీ అనుమతి ఉంటుందని కూడా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ స్పష్టం చేసింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







