ట్రావెల్ & క్వారంటైన్ గైడ్ లైన్స్ అప్టేడ్ చేసిన ఖతార్

- May 22, 2021 , by Maagulf
ట్రావెల్ & క్వారంటైన్ గైడ్ లైన్స్ అప్టేడ్ చేసిన ఖతార్

దోహా: జీసీసీ సభ్యదేశాలకు చెందిన పౌరులు, ప్రవాసీయులు ఏ సమయంలోనైనా తమ దేశానికి ప్రయాణించొచ్చని ఖతార్ స్పష్టం చేసింది. అయితే..ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల ట్రావెల్, క్వారంటైన్ కు సంబంధించి కొన్ని కీలక సూచనలు చేస్తూ గైడ్ లైన్స్ ను అప్ డేట్ చేసింది. జీసీసీ దేశాల పౌరులు, ప్రవాసీయులు ఖతార్ బయల్దేరే ముందు 72 గంటల్లోపు తీసుకున్న పీసీఆర్ నెగటీవ్ రిపోర్ట్ ను సమర్పించటం తప్పనిసరి. అలాగే మొబైల్ లో ఎతెరాజ్ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకొని యాక్టివేట్ చేసుకోవాలని ఖతార్ స్పష్టం చేసింది. అలాగే క్వారంటైన్ కు సంబంధించి ఖతార్ అనుమతి పొందిన కోవిడ్ వ్యాక్సిన్లలో ఏ వ్యాక్సిన్ అయిన పూర్తి డోసులను తీసుకొని రెండు వారాలు గడిచిన వారికి క్వారంటైన్ నుంచి మినహాయింపు ఉంటుంది. అయితే..వ్యాక్సినేషన్ కార్డు లేదు సర్టిఫికెట్ చూపించాల్సి ఉంటుంది. ఇక 18 ఏళ్లలోపు పిల్లలతో ప్రయాణించే తండ్రి/తల్లి ..తాము రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ వారం పాటు క్వారంటైన్ లో ఉండాలి. అయితే..తల్లిదండ్రులు ఇద్దరు పిల్లలతో ప్రయాణించే సందర్భంలో ఇద్దరిలో ఒకరికి క్వారంటైన్ నుంచి మినహాయింపు ఉంటుంది. మరొకరు పిల్లలతో కలిసి వారం పాటు క్వారంటైన్ లో ఉండాలి. ఈ క్వారంటైన్ సమయంలో ఎతెరాజ్ యాప్ లో వారి స్టేటస్ ఎల్లో కలర్లోకి మారుతుంది. అంటే వారు క్వారంటైన్లో ఉన్నట్లు సంకేతం. ఒక్కసారి ఎతెరాజ్ లో స్టేటస్ మారి తల్లిదండ్రుల్లో ఒకరు క్వారంటైన్ కి వెళ్లాక..చివరి వరకు వారే క్వారంటైన్ లో ఉండాలి. ఇదిలాఉంటే గతంలో కోవిడ్ నుంచి కోలుకొని సింగిల్ డోసు తీసుకొని రెండు వారాలు గడిచిన వారు...అలాగే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కోవిడ్ బారిన పడి రెండు వారాలు పూర్తి చేసుకున్నవారికి కూడా క్వారంటైన్ నుంచి మినహాయింపు ఉంటుంది. 

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com