క్రిప్టో కరెన్సీ జోలికి వెళ్లొద్దు..కువైట్ హెచ్చరిక
- May 23, 2021
కువైట్ సిటీ: బిట్ కాయిన్ వంటీ క్రిప్టో కరెన్సీపై ఇన్వెస్ట్ చేస్తున్నారా? అయితే..తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరిస్తోంది కువైట్ సెంట్రల్ బ్యాంక్. డిజిటల్ కరెన్సీని నమ్మిమోసపోవద్దని కువైట్ ప్రజలను అప్రమత్తం చేస్తూ హెచ్చరించింది. కొన్నాళ్లుగా అంతర్జాతీయంగా బిట్ కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీ కొనుగోళ్లకు సంబంధించి ప్రజలకు కాల్స్ వస్తున్న నేపథ్యంలో సెంట్రల్ బ్యాంక్ ఈ ప్రకటన విడుదల చేసింది. క్రిప్టో కరెన్సీలో విలువలో స్థిరత్వం ఉండదు, తీవ్ర హెచ్చుదగ్గులు ఉంటాయి. కనుక ఇన్వెస్టర్లు నిండా మునిగిపోయే అవకాశాలు ఉన్నాయి. పైగా క్రిప్టో కరెన్సీపై కువైట్ సెంట్రల్ బ్యాంక్ నియంత్రణ ఉండదనే విషయాన్ని ప్రజలు గుర్తంచుకోవాలని, అలాగే గ్లోబల్ సెంట్రల్ బ్యాంక్స్, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ వంటి అంతర్జాతీయ సంస్థల నియంత్రణ కూడా ఉండదని స్పష్టత ఇచ్చింది. ఈ కారణంగా డిజిటల్ కరెన్సీ పేరుతో మోసాలు జరిగే అవకాశాలు కూడా ఎక్కువేనని కువైట్ సెంట్రల్ బ్యాంక్ ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాదు..మనీ ల్యాండరింగ్ జరిగే ముప్పు కూడా ఉందని, అందువల్ల క్రిప్టో కరెన్సీపై పెట్టుబడుల విషయంలో కువైట్ పౌరులు అప్రమత్తంగా ఉండాలని, ఫోన్ కాల్స్ తో ఆకర్షణకు గురికావొద్దని సూచించింది.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







