వ్యాక్సిన్ తీసుకున్న పెట్టుబడుదారులకు మాత్రమే ఎంట్రీ

- May 23, 2021 , by Maagulf
వ్యాక్సిన్ తీసుకున్న పెట్టుబడుదారులకు మాత్రమే ఎంట్రీ

బహ్రెయిన్: బహ్రెయిన్ బౌర్స్ కార్యాలయాన్ని సందర్శించే పెట్టుబడిదారులకు సంబంధించి నేషనల్ మెడికల్ టాస్క్ ఫోర్స్ కీలక సూచనలు విడుదల చేసింది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకొని 14 రోజులు పూర్తైన వారు మాత్రమే బహ్రెయిన్ ఇన్వెస్టర్ సర్వీసెస్ సెంటర్ సందర్శించేందుకు అనుమతించనున్నట్లు స్పష్టం చేసింది. అలాగే కోవిడ్ బారిన పడి పద్దెనిమిదేళ్లు నిండిన వారు కూడా ఇన్వెస్టర్ సర్వీసెస్ సెంటర్ సందర్శించొచ్చని వెల్లడించింది. ఈ నెల 23(ఆదివారం) నుంచి జూన్ 3 వరకు ఇన్వెస్టర్లకు అనుమతి ఉంటుందని..అయితే బీఅవేర్ బహ్రెయిన్ యాప్ లో గ్రీన్ స్టేటస్ తప్పనిసరి అని కూడా స్పష్టత ఇచ్చింది. అలాగే ఇన్వెస్టర్లు ముందుగానే Skiplino యాప్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అపాయింట్మెంట్ ఉన్నవారినే ఇన్వెస్టర్ సర్వీసెస్ సెంటర్ ప్రాంగణంలోకి అనుమతిస్తారు. లేదంటే నేషనల్ మెడికల్ టాస్క్ ఫోర్స్ సిఫార్సుల ఆధారంగా అనుమతి ఉంటుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com