యూఏఈలో ఐపీఎల్
- May 23, 2021
ముంబై: ఐపీఎల్‌లో మిగిలిన మ్యాచ్‌లకు బీసీసీఐ చివరకు ఒక పరిష్కారాన్ని కనుగొంది. మిగిలిన మ్యాచ్‌లు సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 మధ్య యూఏఈలో జరుగుతాయని క్రికెట్ వర్గాలు తెలిపాయి. ఈ మ్యాచ్‌ల కోసం బోర్డు రెండు వేదికలను పరిశీలిస్తోంది.ఇంగ్లాండ్ అలాగే యూఏఈ రెండిటిలో ఒక చోట ఐపీఎల్ నిర్వహించాలని భావించింది. అయితే, యూఏఈలోనే నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించినట్టు చెబుతున్నారు.భారత్ లో ప్రారంభమైన ఐపీఎల్ 2021 టోర్నీ 29 మ్యాచ్‌ల తర్వాత కరోనా కారణంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. టోర్నీలో మొత్తం 60 మ్యాచ్ లు ఉన్నాయి. వీటిలో 31 మ్యాచ్‌లు ఇంకా జరగలేదు.
గత సంవత్సరం కూడా కరోనా కారణంగా ఐపీఎల్ యూఏఈలో నిర్వహించారు. దీంతో ఈ సీజన్ లో మిగిలిన మ్యాచ్ లను కూడా ఇక్కడే నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. ఈ నెల 29 వ తేదీన టోర్నమెంట్ కొత్త షెడ్యూల్ ప్రకటిస్తారు. క్రికెట్ వర్గాలు చెబుతున్న దాని ప్రకారం బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశం ఆరోజు జరుగుతుంది. అదేరోజు ఐపీఎల్ తదుపరి మ్యాచ్ షెడ్యూల్ కూడా ప్రకటించే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ U.S.A. ఆధ్వర్యంలో 'ఎకోస్ ఆఫ్ కంపాషన్'
- KL యూనివర్సిటీలో ETV విన్ వారి WIN.Club ప్రారంభం
- తెలంగాణ: 75 ప్రైవేట్ బస్సుల పై కేసులు
- వైకుంఠ ద్వార దర్శనాల పై భక్తుల్లో విశేష సంతృప్తి
- అన్విత బ్రాండ్ అంబాసిడర్గా నందమూరి బాలకృష్ణ
- తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు
- ఒమన్ డెసర్ట్ మారథాన్.. పోటీ పడుతున్న 1,200 మంది..!!
- ప్యాసింజర్ స్టేషన్లను ఆవిష్కరించిన ఇతిహాద్ రైల్..!!
- జాబర్ అల్-అహ్మద్ స్టేడియానికి పోటెత్తిన అభిమానులు..!!
- ఖతార్ లో వెహికల్స్, ప్రాపర్టీల ఆన్లైన్ వేలం..!!







