వైట్‌ ఫంగస్‌ పై అవగాహన కలిపించిన డా.వివేక్‌ ప్రవీణ్‌ దావే

- May 23, 2021 , by Maagulf
వైట్‌ ఫంగస్‌ పై అవగాహన కలిపించిన డా.వివేక్‌ ప్రవీణ్‌ దావే

సమయానికి రోగ నిర్ధారణ మరియు చికిత్స అందించినట్లయితే జీవితానికి లేదా కంటి దృష్టికి ఎలాంటి ప్రమాదం జరిగే అవకాశం లేదు.

“మా అనుభవం ఆధారంగా, వైట్‌ ఫంగస్‌ కేసులు అనేవి ప్రసుత్తం చాలా అరుదు, అందువలన ప్రస్తుతం మనం భయపడాల్సిన అవసరం లేదు. కానీ మనం లక్షణాలను జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. అంతేకాకుండా సకాలంలో చికిత్స తీసుకోవాలి.  సమయానికి రోగ నిర్ధారణ చేసి చికిత్స అందించినట్లయితే అది ఒకరి జీవితానికి లేదా కంటి దృష్టికి ఎలాంటి ప్రమాదం కలిగించదు” అని యల్‌.వి ప్రసాద్‌ ఐ ఇనిస్టిట్యూట్‌ రెటీనా స్పెషలిస్ట్‌ డా.వివేక్‌ ప్రవీణ్‌ దావే అన్నారు.

క్లుప్తంగా:

  • ఇది కంటిలోని రెటినాపై ప్రభావం చూపుతుంది మరియు కంటి దృష్టిని కోల్పోయేందుకు దారితీస్తుంది.
  • కంటి ముందు నల్లని నీడ ఛాయలు లేదా కంటి ముందు తలియాలుతున్నట్లు ఉంటుంది. ఇది కొంత డిగ్రీతో దృష్టి నష్టానికి దారితీస్తుంది.
  • కొంత నొప్పితో కన్ను కొద్దిగా ఎర్రబడుతుంది.
  • ఇది కోవిడ్‌-19 సంక్రమించిన వెంటనే లేదా కోవిడ్‌ నుండి కోలుకున్న ప్రారంభంలోనే సంభవించవచ్చు.
  • కో- మార్బిడిటిస్‌ (రెండు లేదా అంతకంటే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతుంటే) నియంత్రణలో లేని మధుమేహం మరియు దీర్ఘకాలికంగా స్టెరాయిట్లు వినియోగం ఇన్‌డ్వెల్లింగ్‌ IV (ఇంట్రాలీనస్‌) వంటి వాటితో మరింత ప్రమాదానికి దారితీస్తుంది.
  • ఇంట్రాకోక్సుర్‌ సర్జరీ మరియు ఇంట్రాకోక్సుర్‌ ఇంజక్షన్‌తో కంటికి చికిత్స అందించవచ్చు.
  • మ్యుకరోమైకోసిన్‌ (బ్లాక్‌ ఫంగస్‌) వలె కాకుండా ఈ వైట్‌ ఫంగస్‌ యొక్క ప్రభావం ప్రధానంగా కంటిగుడ్డు లోపలి భాగానికి పరిమితం కాబడింది మరియు ముఖానికి సైనస్‌కు శస్త్ర చికిత్స అవసరం లేదు.

 

వైట్‌ ఫంగస్‌ అంటే ఏమిటి?

దీని శాస్త్రీయ నామం కాండిడా అల్బికాన్సీ. ఇది ఒకరకమైన ఫంగస్‌. ఇది సహజంగానే మన శరీరం లోపల మరియు బయట ఉంటుంది. కానీ అది అతిగా పెరిగినట్లయితే ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. లాబరేటరీలో దానిని పరిశీలించినట్లయితే తెల్లగా కనిపిస్తుంది. అందువలన ఈ ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ను ‘వైట్‌ ఫంగస్‌’ అంటారు.ఇది కంటి గుడ్డులోని వివిధ భాగాలను ప్రభావితం చేస్తుంది. ఇది శరీరంలోని ఏభాగాన్నైనా ప్రభావితం చేస్తుంది.మ్యుకరో మైకోసిన్‌ (బ్లాక్‌ ఫంగస్‌)కు ఇది ఎలా భిన్నమైనది?

మ్యుకరో మైకోసిన్‌ ప్రధానంగా కంటి చుట్టూ వుండే కణజాలాన్ని, ముఖ్యంగా ముక్కులోని సైనస్‌కు ప్రభావితం చేస్తుంది, అయితే  అందుకు భిన్నంగా వైట్‌ ఫంగస్‌ కంటి లోపలి కణజాలాన్ని ముఖ్యంగా విట్రస్‌ జల్‌ మరియు రెటినాను ప్రభావితం చేస్తుంది.

మ్యుకరోమైకోసిస్‌ వలె వైట్‌ ఫంగస్‌ జీవితానికి మరియు కంటి దృష్టికి ముప్పుగా పరిణమిస్తుందా?

చికిత్స అందించనట్లయితే ఇది గణనీయంగా కంటి దృష్టికి నష్టాన్ని కలిగిస్తుంది. శరీరానికి మొత్తం సంక్రమించినప్పుడే ఇది ప్రాణాంతకం. తీవ్రంగా బలహీనపడిన మరియు రోగనిరోధక శక్తి లేని రోగుల్లో మాత్రమే ఇది జరుగుతుంది. కోవిడ్‌ నుండి కోలుకున్న రోగుల్లో వైట్‌ఫంగస్‌ మరియు బ్లాక్‌ ఫంగస్‌ను పోల్చడానికి సరైన గణాంకాలు అందుబాటులోలేవు. ఎందుకంటే వైట్‌ఫంగస్‌ కారణంగా వస్తున్న కేసులు ప్రస్తుతం చాలా అరుదుగా ఉన్నాయి.

లక్షణాలు ఏమిటి?

  • కోవిడ్‌ నుండి కోలుకున్న 1 నుండి 3 నెలల్లో దృష్టి తగ్గుతుంది.
  • దృష్టికి నష్టం ప్రధానంగా సెంట్రల్‌ విజన్‌కు నష్టం జరుగుతుంది.
  • నలుపు తెరలు లేదా కంటి ముందు ఎక్కువగా నలుపు కణాలు తేలియాడుతున్నట్లుగా ఉంటుంది.

ఇది ఎందుకు సంభవిస్తుంది?

ప్రస్తుతం కోవిడ్‌ నిర్వహణ పద్ధతులో న్యాయబద్ధంగా అదిక డోసేజ్‌లో స్టెరాయిడ్లు వినియోగం జరుగుతుంది. అలాంటి రోగులో వాని యొక్క ఊపిరితిత్తులు ప్రభావితం అయివుంటాయి. కోవిడ్‌ కారణంగా జరిగిన నష్టాన్ని తగ్గించడంలో, దాని ప్రతికూల ప్రభావం ఏమిటంటే అది శరీర రోగ నిరోధక శక్తిని అణచివేస్తుంది మరియు ఇలాంటి ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లకు మరింత ఉతమిచ్చినట్లవుతుంది.

వైట్‌ ఫంగస్‌ ఎవరిలో ఎక్కువగా ప్రమాదానికి దారీ తీస్తుంది?

తక్కువ రోగ నిరోధక శక్తి కలిగిన వారిలో లేదా రక్తంలో అధికంగా చక్కెర స్థాయులు ఉన్న రోగులకు ఎక్కువ ప్రమాదం పొంచి  ఉంటుంది. కోవిడ్‌-19కు గురైన సందర్భంలో కోవిడ్‌ -19తో సమానంగా లేదా దాని నుండి కోలుకున్న అనంతర దశలో (మొదటిసారిగా జ్వరం వచ్చిన 6 నుండి 8 వారాల లోపు) సంభవించవచ్చు. ఎందుకంటే ఈ కాలంలో రోగిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. డయాబెటిస్‌, సిస్టమిక్‌ ఇమ్యునో సస్ప్రెషన్‌ (తక్కువ గా రోగ నిరోధక శక్తి) లేదా ఇతర క్రానిక్‌ వ్యాధితో బాధపడుతున్న వారు ఈ ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యే అవకాశాలు ఎక్కువ. కోవిడ్‌-19 ఇన్‌ఫెక్షన్‌ను నియంత్రించడంలో స్టెరాయిడ్లను వినియోగించిన రోగులో రోగ నిరోధక శక్తి అణచివేయబడుతుంది మరియు వారిలో బ్లడ్‌ షుగర్‌ లెవెల్స్‌ పెరుగుతాయి.

దీనికి చికిత్స ఏమిటి?

ఇంట్రాకోక్యురీ సర్జరీ, కంటి లోపల యాంటి ఫంగల్‌ ఇంజెక్షన్లు మరియు నోటి ద్వారా యాంటి ఫంగల్‌ ఏజెంట్లను అందించాలి. తరచుగా శస్త్ర చికిత్సలు చెయాలి. చికిత్స 4 నుండి 6 వారాలు చేయాలి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించాలి. రోగిలో రోగ నిరోధక శక్తి పెంచడం చాలా ముఖ్యం.

--డా.వివేక్‌ ప్రవీణ్‌ దావే (రెటీనా స్పెషలిస్ట్‌ యల్‌వి ప్రసాద్‌ ఐ ఇనిస్టిట్యూట్‌,హైదరాబాద్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com