రవితేజ 6 ప్యాక్ లుక్...
- March 05, 2016
సినిమా సెలక్షన్ విషయంలోనే కాదు, లుక్ విషయంలో కూడా సీనియర్ హీరోలు కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నారు. యంగ్ జనరేషన్ కూడా సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించడానికి ఆలోచిస్తుంటే సీనియర్లు మాత్రం సూపర్ బాడీతో షాక్ ఇస్తున్నారు. తాజాగా మాస్ మహరాజ్ రవితేజ కూడా ఈ లిస్ట్ లో చేరిపోయాడు. ఇటీవల బెంగాల్ టైగర్ సినిమాతో మంచి కమర్షియల్ హిట్ సాధించిన రవితేజ తన నెక్ట్స్ సినిమా కోసం కొత్త లుక్ ట్రై చేస్తున్నాడు.మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన రవితేజ ఈమధ్య స్టైలిష్ హీరోగా పేరు తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నాడు. అయితే ఆ ప్రయత్నంలో మరీ సన్నగా అయిన రవితేజ లుక్ పై విమర్శలు రావడం, అదే లుక్ లో కనిపించిన కిక్ 2 భారీ డిజాస్టర్ గా నిలిచింది.దీంతో తిరిగి ఫాంలోకి రావాలని భావించిన రవితేజ 6 ప్యాక్ తో అలరించడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం రవితేజ హీరోగా నటిస్తున్న రాబిన్ హుడ్ సినిమాలో సిక్స్ ప్యాక్ లో కనిపించనున్నాడు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







