రెస్టారెంట్లు, కాఫీ షాపులు పునః ప్రారంభం

- May 24, 2021 , by Maagulf
రెస్టారెంట్లు, కాఫీ షాపులు పునః ప్రారంభం

కువైట్ సిటీ: రెస్టారెంట్లు, కాఫీ షాపులు వినియోగదారుల కోసం తెరుచుకుంటున్నాయి. కరోనా నేపథ్యంలో కొంతకాలంగా వీటిని (డైన్ ఇన్ వరకూ) మూసివేసిన విషయం విదితమే. ఇకపై డైన్ ఇన్ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. కువైట్ క్యబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వినియోగదారులంతా ఖచ్చితంగా కరోనా నిబంధనలు పాటించాలి. వినియోగదారుల శరీర ఉష్ణోగ్రతను పరిశీలించాకే వారిని లోపలికి అనుమతించాల్సి వుంటుంది. కాగా, రాత్రి 8 గంటలకి వీటిని మూసివేయాలని అధికార వర్గాలు స్పష్టం చేయగా, మూసివేత సమయాన్ని 10 గంటల వరకు పొడిగించాలని రెస్టారెంట్లు, కాపీ షాపుల యజమానులు అలాగే వినియోగదారులు కూడా కోరుతున్నారు. ప్రస్తుతం ఉదయం 5 గగంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వీటిని అనుమతిస్తున్నారు.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com