భారత్ కు తలనొప్పిగా మరో వ్యాధి..కరోనా నుండి కోలుకున్నవారికే
- May 24, 2021
కరోనా ఫస్ట్ వేవ్ తగ్గిందని.. అంతా రిలాక్స్ అవుతోన్న సమయంలో.. సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోంది.. మధ్యలో.. బ్లాక్ ఫంగస్ వచ్చి చేరింది.. దేశవ్యాప్తంగా బ్లాక్ ఫంగస్ విజృంభణ కొనసాగుతుండగా.. తాజాగా, బ్లాక్ ఫంగస్‌ను అంటువ్యాధిగా పరిగణించాలంటూ తాజాగా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది. బ్లాక్ ఫంగస్ గురించి ప్రజలకు తెలిసే లోపే.. పాట్నాలో నాలుగు వైట్ ఫంగస్ కేసులు బయటపడ్డాయి. దీంతో దేశ ప్రజలు దిక్కు తోచని పరిస్థితిని ఎదురుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మరో కొత్త సమస్య వచ్చి పడింది. కరోనా నుంచి కోలుకున్న వారిలో గ్యాంగ్రీన్ వ్యాధిని గుర్తించమని వైద్య నిపుణులు చెబుతున్నారు. రక్తనాళాలు మూసుకుపోవడం..దీంతో ఆ భాగానికి ప్రాణవాయువు, పోషకాల సరఫరా నిలిచిపోవడం ఈ వ్యాధి లక్షణం. గ్యాంగ్రీన్ వ్యాధిని త్వరగా గుర్తించకపోతే.. మరణం సంభవిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి కేసులు గుజరాత్ లో బయటపడ్డట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్‌ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







