విజయవాడలో ప్రైవేట్ ఆస్పత్రులపై భారీ జరిమానా..!
- May 24, 2021
విజయవాడ: కరోనా కష్టకాలంలో ఇష్టానుసారం బిల్లులు వేస్తూ..భారీగా ఫీజులు వేస్తూ ప్రజలను పీల్చి పిప్పిచేస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలకు పూనుకుంది ఏపీ ప్రభుత్వం.చికిత్సకు అధిక ఫీజులు వసూలు చేయడం, ఆరోగ్యశ్రీ కి బెడ్లు కేటాయించని ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు తీసుకుంది.విజయవాడలోని కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు తీసుకోవడంతో పాటు.. భారీగా జరిమానా విధించింది.అందులో. సాయి దీపు ఆస్పత్రి, ఆంధ్రా ఆస్పత్రికి చెరో రూ.6 లక్షల ఫైన్ వేశారు అధికారులు..స్మైల్ ఆస్పత్రి, గుడివాడ ఈవీఆర్ ఆస్పత్రికి చెరో రూ.6 లక్షల జరిమానా విధించారు.ఇక, లలిత లైఫ్ కేర్, లిబర్టీ ఆస్పత్రికి చెరో రూ.4 లక్షలు, క్రేన్, వేదాంత ఆస్పత్రికి చెరో రూ.3 లక్షలు, సాయి మాధవి, సన్ రైజ్, పీవీ ప్రజ్ఞ ఆస్పత్రులకు రూ.2 లక్షల చొప్పున జరిమానా విధించారు.దీంతో..ఇప్పటి వరకు జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రులపై రూ. 56 లక్షల వరకు జరిమానా విధించారు అధికారులు.
మరోవైపు.. విజయవాడ కరోనా వైద్యం నుంచి క్రమంగా ప్రైవేట్ ఆస్పత్రులు తప్పుకుంటున్నాయి.స్వచ్ఛందంగా కోవిడ్ వైద్యం అనుమతి రద్దు చేసుకున్నాయి నాలుగు ప్రైవేట్ ఆస్పత్రులు.. అందులో.. లలిత లైఫ్ కేర్ ఆసుపత్రి, ఏంజె నాయుడు ఆసుపత్రి, క్రేన్ ఆసుపత్రి, శ్రీ శాంతి ఆసుపత్రి ఉన్నాయి.పలు కారణాలతో కోవిడ్ వైద్యం అందించలేమని.. అనుమతి రద్దు చేయాలని అధికారులకు విన్నవించుకున్నాయి.దీంతో..వారి విజ్ఞప్తిని పరిశీలించి రద్దు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







