పిల్లలను బిచ్చగాళ్ళగా మార్చుతున్న ముగ్గురు మహిళలకు జైలు, జరిమానా

- May 24, 2021 , by Maagulf
పిల్లలను బిచ్చగాళ్ళగా మార్చుతున్న ముగ్గురు మహిళలకు జైలు, జరిమానా

దుబాయ్: దుబాయ్ క్రిమినల్ కోర్టు ముగ్గురు మహిళలకు 5,000 దిర్హాములు (ఒక్కొక్కరికి) జరీమానా అలాగే ఆరు నెలల జైలు శిక్ష విధించింది. నిందితులైన మహిళలు, చిన్న పిల్లల్ని బిచ్చమెత్తుకోవడం కోసం వినియోగిస్తున్నట్లు విచారణలో తేలింది. ఓ మహిళను నైఫ్ పోలీసులు ఓ కమర్షియల్ సెంటర్ వద్ద అరెస్టు చేశారు. ఓ ఎనిమిదేళ్ళ బాలుడు సమీపంలోని రోడ్లపై బిచ్చమెత్తుకుంటుండగా, అతన్ని పోలీసులు పట్టుకుని ఆరా తీయగా, అతని తల్లి ఆచూకీ తెలిసింది. ఆమెని కూడా అరెస్టు చేశారు. ఆ మహిళ మరో ఇద్దరు అరబ్ మహిళలు, వారి చిన్నారులతో యూఏఈ చేరుకుని, బిచ్చగాళ్ళలా మారినట్లు విచారణలో గుర్తించారు. మొదటి నిందితురాలి అరెస్టుతో మిగతా ఇద్దరి ఆచూకీ దొరికింది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద మిగిలిన ఇద్దరు మహిళల్ని అరెస్టు చేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com