ఇక సినిమాలకు గుడ్ బై అంటున్న చంద్రమోహన్
- May 24, 2021
హైదరాబాద్: పొట్టివాడైనా మహా గట్టివాడు చంద్రమోహన్. ఆదివారంతో 81 సంవత్సరాలు పూర్తి చేసుకున్న చంద్రమోహన్ ఇకపై నటనకు దూరంగా ఉంటానంటున్నారు.1966లో రంగులరాట్నం నుంచి ఇప్పటి వరకూ తన 55 ఏళ్ళ కరీర్ లో దాదాపు 930కి పైగా సినిమాల్లో నటించారు చంద్రమోహన్. ఇటీవల కాలంలో అరుదుగా తెరపై కనిపించిన చంద్రమోహన్ ఇక దర్శక నిర్మాతలను ఇబ్బంది పెట్టదలచుకోలేదంటున్నారు. హీరోగా కెరీర మొదలెట్టి సహాయపాత్రలు, క్యారెక్టర్ రోల్స్ లో, కామెడీ పాత్రల్లో తెలుగువారికి కనువిందు చేశారు. ‘రాఖీ’ తర్వాత బైపాస్ సర్జరీ చేయించుకున్న చంద్రమోహన్ వల్ల ‘దువ్వాడ జగన్నాథమ్’ వంటి సినిమాలు షూటింగ్ వాయిదా వేయవలసి వచ్చింది. దాంతో ఇక ఇంటికే పరిమితం అయి కుటుంబ సభ్యులతో కాలం గడుపుతున్నారు. దక్షిణాదిన మూడు తరాల నటీనటులతో కలసి నటించిన తారల్లో చంద్రమోహన్ కూడా ఒకరు కావటం విశేషం.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







