ఓటీటీ రిలీజ్ కు నో చెప్పిన హీరో

- May 24, 2021 , by Maagulf
ఓటీటీ రిలీజ్ కు నో చెప్పిన హీరో

యువ న‌టుడు విశ్వ‌క్ సేన్ హీరోగా న‌టిస్తోన్న చిత్రం పాగ‌ల్‌. ఈ చిత్రం ప్రొడక్ష‌న్ ప‌నులు చివ‌రి ద‌శ‌లో ఉన్నాయి.ల‌వ్ డ్రామా నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ మూవీకి ప‌లు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ నుంచి ఆఫ‌ర్లు వ‌చ్చాయ‌ట‌. అయితే విశ్వ‌క్ సేన్ అండ్ మేక‌ర్స్ మాత్రం ఓటీటీ విడుద‌ల‌కు నో చెప్పార‌ట‌. తొలుత ఓటీటీలోనే విడుదల చేయాల‌నుకున్నారు మేక‌ర్స్ . కానీ థియేట‌ర్ల‌లో విడుద‌ల చేస్తే బిజినెస్ ఎక్కువ‌గా ఉంటుంద‌ని విశ్వ‌క్ సేన్ ఆలోచ‌న మేర‌కు మేకర్స్..బిగ్ స్క్రీన్ పైనే సినిమాను చూపించాల‌ని ఫిక్స్ అయిన‌ట్టు టాలీవుడ్ వ‌ర్గాల టాక్‌.

ఈ చిత్రంలో నివేదా పేతురాజ్ హీరోయిన్ గా న‌టిస్తోంది. లాక్‌డౌన్ ఎఫెక్ట్ తో థియేట‌ర్లు మూత‌ప‌డ్డ విష‌యం తెలిసిందే. థియేట‌ర్లు రీఓపెన్ అయిన వెంట‌నే పాగ‌ల్ సినిమా విడుద‌ల తేదీపై క్లారిటీ ఇవ్వ‌నున్నారు మేక‌ర్స్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com