ఇక సినిమాలకు గుడ్ బై అంటున్న చంద్రమోహన్

- May 24, 2021 , by Maagulf
ఇక సినిమాలకు గుడ్ బై అంటున్న చంద్రమోహన్

హైదరాబాద్: పొట్టివాడైనా మహా గట్టివాడు చంద్రమోహన్. ఆదివారంతో 81 సంవత్సరాలు పూర్తి చేసుకున్న చంద్రమోహన్ ఇకపై నటనకు దూరంగా ఉంటానంటున్నారు.1966లో రంగులరాట్నం నుంచి ఇప్పటి వరకూ తన 55 ఏళ్ళ కరీర్ లో దాదాపు 930కి పైగా సినిమాల్లో నటించారు చంద్రమోహన్. ఇటీవల కాలంలో అరుదుగా తెరపై కనిపించిన చంద్రమోహన్ ఇక దర్శక నిర్మాతలను ఇబ్బంది పెట్టదలచుకోలేదంటున్నారు. హీరోగా కెరీర మొదలెట్టి సహాయపాత్రలు, క్యారెక్టర్ రోల్స్ లో, కామెడీ పాత్రల్లో తెలుగువారికి కనువిందు చేశారు. ‘రాఖీ’ తర్వాత బైపాస్ సర్జరీ చేయించుకున్న చంద్రమోహన్ వల్ల ‘దువ్వాడ జగన్నాథమ్’ వంటి సినిమాలు షూటింగ్ వాయిదా వేయవలసి వచ్చింది. దాంతో ఇక ఇంటికే పరిమితం అయి కుటుంబ సభ్యులతో కాలం గడుపుతున్నారు. దక్షిణాదిన మూడు తరాల నటీనటులతో కలసి నటించిన తారల్లో చంద్రమోహన్ కూడా ఒకరు కావటం విశేషం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com