విద్యార్ధులకు వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టిన స్కూల్స్
- May 25, 2021
యూఏఈ: పన్నెండేళ్లు, అంతకుమించి వయసున్న వారికి ఫైజర్ బయోన్టెక్ కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో..యూఏఈలోని అన్ని స్కూల్స్ యాజమాన్యాలు తమ విద్యార్ధులకు వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపడుతున్నాయి. దేశవ్యాప్తంగా చేపట్టిన ఈ భారీ డ్రైవ్ తో విద్యార్ధులకు వ్యాక్సినేషన్ పూర్తి చేయటం ద్వారా స్కూల్స్ నిర్వహణలో కొన్ని వెసులుబాట్లు పొందే అవకాశాలు లేకపోలేదు. వ్యాక్సినేషన్ పూర్తి అయితే నేరుగా తరగతులు నిర్వహించేందుకు వీలుంటుంది. దీంతో దేశవ్యాప్తంగా అన్ని సూళ్ల యజమాన్యాలు తమ విద్యార్ధులకు వ్యాక్సిన్ అందించేందుకు తగిన ఏర్పాట్లతో సిద్ధమయ్యాయి. కొన్ని స్కూళ్ల నిర్వాహకులు..వ్యాక్సినేషన్ కోసం హోటల్స్ ను బుక్ చేసుకోగా..మరికొన్ని స్కూళ్ల నిర్వాహకులు ఆరోగ్య కేంద్రాలను సంప్రదించి అనువైన సమయాలను ఎంపిక చేసుకొని ఆయా సమయాల్లో తమ విద్యార్ధులకు వ్యాక్సిన్ ఇచ్చేలా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







