చెరుకు రసంలో ఆశ్చర్య కరమైన ఆరోగ్య రహస్యాలు..
- March 05, 2016
వేసవి కాలం మొదలైంది. మండే ఎండలు నుంచి సామాన్యులు ఎక్కువగా సేద తీరేది చెరుకు రసంతోనే. చెరుకు రసం అతి తక్కువ ధరతో సామాన్యులకు అందుబాటులో ఉండటమే కాకుండా ఈ తీయటి చెరుకు రసంలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వైద్యులు కూడ ఈ చెరుకు రసాన్ని తీసుకోవడం వల్ల వచ్చే ఫలితాలను తరుచు చెపుతున్నారు.ఆశ్చర్య కరమైన ఆ ఫలితాలు చదివితే చెరుకు రసంలో ఇన్ని ఆరోగ్య రహస్యాలు ఉన్నాయా అని ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక వివరాలలోకి వెళితే చెరుకు రసంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఏర్పడే ఫ్రీ ర్యాడికల్స్ ప్రభావాన్ని తగ్గించడమే కాక, కణాలు నాశనం కాకుండా చూస్తాయి. దీంతోపాటు శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేసి గుణం చెరుకు రసానికి ఉంది.సాధారణ జలుబు, ఇతర ఇన్‌ఫెక్షన్లను తగ్గించడంలో చెరుకు రసం బాగా పనిచేస్తుంది. చెరుకు రసం శరీరంలోని ప్రోటీన్ లెవల్స్‌ను పెంచుతుంది. మూత్రాశయ ఇన్‌ఫెక్షన్ల బారి నుంచి రక్షిస్తుంది. కిడ్నీల పనితనం మెరుగు పడుతుంది. లివర్‌ను పటిష్టం చేస్తుంది. పచ్చకామెర్ల వ్యాధి ఉన్న వారికి చెరుకు రసం మంచి ఔషధంగా పనిచేస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. చెరుకు రసాన్ని తరచూ తీసుకుంటే మలబద్దకం తొలగిపోతుంది అనే మాట కూడ ఉంది. సహజసిద్ధమైన లాక్సేటివ్ గుణాలు దీంట్లో ఉన్నాయి. కడుపులో మంట, అసిడిటీ వంటి సమస్యలను చెరుకు రసం తగ్గిస్తుంది.మధుమేహం ఉన్నవారు కూడా నిరభ్యంతరంగా చెరుకు రసాన్ని తాగవచ్చని వైద్యులు చెపుతున్నారు. నోటి దుర్వాసనను, దంత క్షయాన్నితగ్గించే అనేక రకాల విటమిన్లు, మినరల్స్ చెరుకు రసంలో ఉన్నాయి. ఈవిధంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్న చెరుకు రసం సామాన్యుల పాలిట అమృతం.
తాజా వార్తలు
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- Kuwait air defences intercept Iranian missile, drone attacks
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక







