వ్యాక్సినేషన్ కేంద్రాల దగ్గర ఉచిత పార్కింగ్
- May 26, 2021
దుబాయ్: వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలో ఎక్కువ మంది పాల్గొనేలా దుబాయ్ పాలనా యంత్రాంగం ప్రజలకు మరో వెసులుబాటు కల్పించింది. వ్యాక్సినేషన్ కోసం వచ్చే వారు తమ వాహనాలను పార్క్ చేసుకునేందుకు వ్యాక్సినేషన్ కేంద్రాల సమీపంలో ఉచిత పార్కింగ్ సౌకర్యాన్ని కల్పించింది. ఈ మేరకు రోడ్లు మరియు రవాణా అథారిటీ (ఆర్టీఏ) ప్రకటన విడుదల చేసింది. ప్రతి టీకా కేంద్రం సమీపంలో సుమారు 50 పార్కింగ్ స్థలాలు అందుబాటులో ఉంటాయని అథారిటీ తెలిపింది. హోర్ అల్ అంజ్, అల్ బర్షా, అల్ ఖుసైస్ హెల్త్ సెంటర్ తో పాటు..గ్రాండ్ హయత్ హోటల్ టెంట్ సమీపంలో ఉచిత పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశామని ఆర్టీఏ అధికారులు వెల్లడించారు. అర్హతగల దుబాయ్ ప్రజలు అందరికీ టీకాలు వేసే వరకు ఉచిత పార్కింగ్ వెసులుబాటు అమలులో ఉండనుంది.
తాజా వార్తలు
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!







